సింగపూర్ : యోగా సెంటర్‌లో మహిళలపై వేధింపులు, భారతీయుడిపై అభియోగాలు.. నేరం రుజువైతే

యోగా సెంటర్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడిన అభియోగాలపై సింగపూర్‌లో ఓ భారతీయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.అతనిని రాజ్‌పాల్ సింగ్‌గా గుర్తించారు.

 Indian National On Molestation Trial At Yoga Centre In Singapore Details, Indian-TeluguStop.com

సెంట్రా బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో యోగా సెంటర్‌లో రాజ్‌పాల్‌ నలుగురు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు .ప్రాసిక్యూటర్లు 8 అభియోగాలు నమోదు చేశారు.జూలై 11, 2020న రాజ్‌పాల్ తనపై వేధింపులకు పాల్పడినట్లు ఒక మహిళ ఆరోపించింది.అప్పడు తన వయసు 24 సంవత్సరాలని చెప్పింది.యోగా క్లాస్ ముగిసిన తర్వాత ఏం జరిగిందో, రాజ్‌పాల్ తనతో ఎలా ప్రవర్తించాడో తన మిత్రుడికి వాట్సాప్ ద్వారా తెలిపింది.

డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలీన్ యాప్ సింగ్ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.

అంతేకాకుండా ఆ సమయంలో ట్రస్ట్‌లో సేల్స్ అసిస్టెంట్ మేనేజర్‌గా వున్న అరవింద్ గణరాజ్‌తోనూ దీనిపై మాట్లాడింది.ఆ మరుసటి రోజు ఛాటింగ్ ద్వారా ఒకరికొకరు సంభాషించుకున్నారు.అనంతరం జూలై 31, 2020న ఆ మహిళ తన అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.ఆ వెంటనే 28, 37 ఏళ్లు వున్న మరో ఇద్దరు మహిళలు తొలి బాధితురాలిని సంప్రదించారు.

Telugu Aravind Ganaraj, Indian National, Trial, Nri Yoga, Rajpal Singh, Singapor

28 ఏళ్ల రెండో బాధితురాలు తన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.నాల్గవ బాధితురాలు 2020 ఆగస్ట్ 25న ట్రస్ట్ యోగాకు సంబంధించి ఆన్‌లైన్ రివ్యూ చూసింది.ఈ క్రమంలో ఫేస్‌బుక్ ద్వారా రెండో బాధితురాలిని సంప్రదించి .తన అనుభవాన్ని పంచుకుంది.తర్వాత రెండవ బాధితురాలు.ఆమెను తొలి బాధితురాలికి పరిచయం చేసింది.దీని తర్వాత వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాట్లాడుకున్నారు.కోర్టుకు అందజేసిన పత్రాల ప్రకారం.

నలుగురు బాధితులు జూలై, ఆగస్ట్ 2020లలో వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telugu Aravind Ganaraj, Indian National, Trial, Nri Yoga, Rajpal Singh, Singapor

33 ఏళ్ల రాజ్‌పాల్ సింగ్ . ఏప్రిల్ 1, 2019 నుంచి టెలోక్ అయర్ స్ట్రీట్‌లోని ట్రస్ట్ యోగాలో యోగా శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.ఈ అభియోగాలపై ఈరోజున అతనిపై కోర్టులో విచారణ జరగనుంది.

అయితే అతను మరో మహిళపైనా వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.దీనిపై తర్వాత విచారణ జరిగే అవకాశం వుందని మీడియా తెలిపింది.

కోర్ట్ గ్యాగ్ ఆర్డర్ కారణంగా ఐదుగురు మహిళల పేర్లు బయటకి వెల్లడించరాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube