కువైట్ లోని ప్రవాసులకోసం భారత ఎంబసీ “ఓపెన్ హౌస్”

భారత్ నుంచీ ఎంతో మంది వలస కార్మికులుగా, పలు ఉద్యోగాల కోసం కువైట్ కు వలసలు వెళ్తూ ఉంటారు.

అలా వెళ్ళిన వారిలో కొందరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారు.

యమనానుల చే హింసలకు గురవ్వడం, లేదా పని చేయించుకున్న యజమానులు జీతాలు చెల్లించకపోవడం, పాస్ పోర్ట్ సమస్యలు, ఉద్యోగాలు కోల్పోవడం, కొందరు అనుకోని ప్రమాదాల కారణంగా చనిపోతే తదుపరి ఎలా భారత్ రావాలి, వారికి ప్రమాద భీమా ఎలా వర్తిస్తుంది ఇలాంటి వివరాలు ఎంతో మంది ప్రవాసులకు అవగాహన లేదు.అందుకే కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ వారి సందేహాలు నివృత్తి చెయడానికి ఓ వర్చువల్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు ఇందులో.

ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు విషయాలు చర్చకు రానున్నాయట.అందులో ఒకటి కరోనా కారణంగా ఏర్పడిన నిభంధనల కారణంగా కువైట్ రాలేకపోతున్న భారతీయుల అంశం అలాగే ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ , మూడవది కువైట్ లో మృతి చెందుతున్న భారతీయుల మరణాల విషయంలో సందేహాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంటి అంశాలు.

ఇలా ఈ మూడు విషయాలపై రాయభారి సిబి జార్జ్ క్లారిటీ ఇవ్వనున్నారట.అంతేకాదు కేవలం ఈ మూడు విషయాలపై మాత్రమే కాకుండా ప్రవాసులు ఎలాంటి సందేహాలు అయినా నివృత్తి చేసుకోవచ్చని ఎంబసీ తెలిపింది.

Advertisement

పాస్ పోర్ట్ నెంబర్, సివిల్ ఐడీ నెంబర్ , ఫోన్ నెంబర్ లను [email protected] కి ఈమెయిల్ చేస్తూ సమస్యలను ప్రస్తావించవచ్చని తెలిపింది.

కువైట్ లో భారతీయులు ఎదుర్కుంటున్న సమస్యల ఎలాంటివైనా ఈ మీటింగ్ లో ప్రస్తావించవచ్చని ఎంబసీ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు