సాధారణంగా క్రికెట్ రంగానికి సినిమా రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది.ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగిన వారు క్రికెటర్లతో ప్రేమలో పడటం.
అనంతరం వైవాహిక జీవితంలో ఒకటి కావడం జరుగుతుంది ఇలా క్రీడా రంగానికి సినిమా రంగానికి మధ్య ఎంతో మంచి అనుబంధము ఉంది.ఇదిలా ఉండగా తాజాగా మరొక ఇండియన్ క్రికెటర్ బాలీవుడ్ ముద్దుగుమ్మలతో కలిసి రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఇండియన్ క్రికెటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శిఖర్ ధావన్ త్వరలోనే వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
సత్రమ్ రమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబల్ ఎక్స్ ఎల్ అనే సినిమాలో శిఖర్ ధావన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఈయన హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హాతో కలిసి రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయన వెండి తెర సినిమాలలో నటిస్తున్న విషయం పై క్లారిటీ వచ్చింది.
ఈ క్రమంలోనే ఈ విషయంపై శిఖర్ ధావన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా శిఖర్ ధావన్ మాట్లాడుతూ.దేశం తరఫున ఆడే నాలాంటి అథ్లెటిక్ జీవితంలో ఒక క్షణం పాటు ఖాళీ సమయం ఉండదు అయినప్పటికీ నేను కాస్త సమయాన్ని తీరిక చేసుకొని కొన్ని సినిమాలు కూడా చూస్తుంటానని తెలిపారు.ఈ క్రమంలోనే డబల్ ఎక్సెల్ సినిమా అవకాశం వచ్చినప్పుడు ముందుగా కథ విన్నాను.
ఈ సినిమా కథ నా మనసును తాకింది.ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక సందేశం ఇవ్వచ్చని భావించాను మనం ఎలా ఉన్నా కానీ మన కలలను మాత్రం నెరవేర్చుకోవాలనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ ఈ డబల్ ఎక్సెల్ సినిమా నింపుతుందని ఈ సందర్భంగా శిఖర్ ధావన్ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.