భారతదేశంలో ఆహార వ్యర్ధాలు, పర్యావరణంపై పోరాడుతున్న సంస్థలు బ్రిటన్ ప్రిన్స్ విలియం( Prince William ) నెలకొల్పిన ‘‘ GBP 1 million 2023 Earthshot Prize ’’కు ఎంపికయ్యాయి.దీనిని ‘‘ఎకో ఆస్కార్’’ అవార్డుగా కూడా వ్యవహరిస్తారు.
నిధి పంత్,( Nidhi Pant ) వైభవ్ టిడ్కే,( Vaibhav Tidke ) స్వప్నిల్ కోక్టే,( Swapnil Kokte ) గణేష్ భేరే, శీతల్ సోమాని, తుషార్ గవారే , అశ్విన్ పవాడేచేలు స్థాపించిన ‘‘ఎస్4 టెక్నాలజీస్’’ సంస్థ ‘‘బిల్డ్ ఏ వేస్ట్ – ఫ్రీ వరల్డ్ ’’ విభాగంలో విజేతగా నిలిచింది.‘‘ ఫిక్స్ ఆవర్ ప్లానెట్ ’’ విభాగంలో ఆదిత్ మూర్తికి చెందిన ‘‘ భూమిత్ర ’’( Boomitra ) అవార్డుకు ఎంపికైంది.
ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న రైతులకు అండగా నిలిచింది.

ఈ సందర్భంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియం మాట్లాడుతూ.గతేడాది వాతావరణంలో మార్పులు మానవాళికి సవాలు విసిరిందన్నారు.శీతోష్ణస్థితి ప్రభావాలు మనిషి మరిచిపోలేనంతగా కనిపించిన సంవత్సరంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అభివర్ణించారు.
ఎర్త్ షాట్ ఫైనలిస్టులలో ఆశావాదం ప్రకాశవంతంగా వుందని.భూమిత్ర, ఎస్4ఎస్, జీఆర్‌సీటీ, వైల్డ్ ఎయిడ్ మెరైన్ ప్రోగ్రామ్ సంస్థలకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ఇకపోతే.ఎస్ 4 ఎస్ అంటే ‘‘సైన్స్ ఫర్ సొసైటీ’’.( Science for Society ) వ్యర్ధాలు లేని ఆహార వ్యవస్ధను సృష్టించడం, లక్షలాది మంది మహిళా రైతుల జీవితాలను మార్చే లక్ష్యంతో దీనిని స్ధాపించారు.ఎస్ 4 ఎస్ మహిళా రైతులతో( Women Farmers ) కలిసి కొత్త ఆహార పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోందన్నారు ఈ సంస్థ కో ఫౌండర్ నిధి పంత్.
వృధాను తగ్గించడం, ప్రపంచ ఆహార అవసరాలను తీరుస్తూ జీహెచ్‌జీ (గ్రీన్‌హౌస్ గ్యాస్) ఉద్గారాల పెరుగుదలను తగ్గిస్తుందని ఆమె పేర్కొన్నారు.ఆహార భద్రత, ఆదాయాలు పెంచడం, ఉద్యోగాల సృష్టి, స్థానిక ఆర్ధిక వ్యవస్థలను పెంపొందించడం, ప్రభుత్వంతో కలిసి వాదించడం ద్వారా వాతావరణ మార్పులపై పోరాడేందుకు సాధికారత పొందిన మహిళా రైతులు నాయకత్వం వహిస్తున్నారని నిధి తెలిపారు.

మరో భారతీయ సంస్థ ‘‘భూమిత్ర’’ విషయానికి వస్తే ‘భూమికి స్నేహితుడు’( Friend Of The Earth ) అనే అర్ధం వచ్చేలా పేరు పెట్టారు.రైతులకు స్థిరమైన భూ నిర్వహణ పద్ధతులను అందించడం ఈ సంస్థ ధ్యేయం.ప్రస్తుతం భూమిత్ర.1,50,000కు పైగా మంది రైతులతో పనిచేస్తోంది.అర ఎకరం వున్న చిన్న రైతుల నుంచి మోతుబరుల వరకు .ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో 5 మిలియన్ ఎకరాలకు పైగా భూమిని ఈ సంస్థ నిర్వహిస్తోంది.







