విజయవాడలో ఏర్పాటైన టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో భాగంగా జేఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇందులో భాగంగానే రైతులకు అండగా నిలవాలని జేఏసీ తీర్మానించింది.కరవు మండలాల్లో పర్యటించాలని నిర్ణయించిన జేఏసీ రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా అందేలా పోరాడాలని పిలుపునిచ్చింది.
అలాగే పదిహేను రోజులకు ఒకసారి జేఏసీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.ఈ సారి ఏర్పాటు చేయనున్న సమావేశం జనసేన కార్యాలయంలో జరగనుంది.
ఈనెల 14, 15, 16 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.ఈ క్రమంలోనే రెండు పార్టీలకు చెందిన ఉమ్మడి మ్యానిఫెస్టోను త్వరలోనే ఖరారు చేస్తామని ప్రకటించారు.
ఈ మేరకు మ్యానిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.కాగా ఈనెల 13 న ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీ భేటీకానుందని అచ్చెన్నాయుడు తెలిపారు.







