బ్యాంకు వినియోగదారులకు హైఅలెర్ట్!

సామాన్యుల నుంచి బిజినెస్ వ్యవహారాలు నడిపే వారి వరకు ప్రతి ఒక్కరికి బ్యాంకుల్లో పని ఉంటుంది.

చెక్కులు డిపాజిట్ చెయ్యడం, నగదు విత్డ్రా చేసుకోవడం, డీడీలు జమ చేసుకోవడం వంటి పనులు చాలానే ఉంటాయి.

బ్యాంకు ఉన్న ప్రతి రోజు ముఖ్యమైన రోజు అనే చెప్పాలి.కొన్ని కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెలవులు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి.

అప్పుడే ఇబ్బందులు పడరు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ నెలలో ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయి అనేది చూస్తే షాక్ అవుతారు.

ఎందుకంటే మాములుగా కంటే కూడా ఈ నెలలో ఎక్కువ సెలవులు వచ్చాయి.ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆగస్టు నెలలోని రెండు, నాలుగు శనివారాలు అయినా 8, 22 తేదీల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

Advertisement

ఆగస్ట్ నెలలో 5 ఆదివారాలు 2, 9, 16, 23, 30 తేదీల్లో బ్యాంకులకు సెలవు ఇచ్చారు.ఆగస్ట్ 1న నేడు బక్రీద్ సందర్భంగా బ్యాంకులు క్లోజ్.

ఈ నెల ఆగస్టు 11న మంగళవారం శ్రీ‌కృష్ణ జ‌యంతి సందర్భంగా బ్యాంకులు పని చేయవు.ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్యాంకులకు సెలవు.

ఆగస్ట్ 22 వినాయక చవితి, ఆగస్ట్ 30న మొహరం రోజున బ్యాంకులకు సెలవు.ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 రోజులు సెలవులు.

అందుకే బ్యాంకు పనులు ఏమైనా ఉంటే ఈ సెలవులు రోజులు కాకుండా మిగితా రోజులు ప్లాన్ చేసేసుకోండి.సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించే వారికీ ఎలాంటి ఆటంకాలు ఉండవు.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు