హిమాలయాలలో అశ్వద్దామా ఆనవాళ్ళు! అవును అంటున్న ఆర్మీ

మహాభారత కథలో అశ్వద్దామా అనే పాత్ర ఎంత ఫేమస్ అనేది అందరికి తెలుసు.

ఇక కౌరవ పక్షపాతి, ద్రోణుడు కొడుకు అయిన అతను ఇంకా బ్రతికే ఉన్నాడని అందరూ విశ్వసిస్తూ ఉంటారు.

అయితే అందులో ఎంత వరకు వాస్తవం అనేది ఎవరు ఇప్పటికి నమ్మకం కలగడం లేదు.కాని అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు అతను ఉన్నాడు అనేదానికి ఆనవాళ్ళుగా కనిపిస్తూ ఉంటాయి.

అతను జైంట్ తరహాలో ముప్పై రెండు అడుగుల పొడవు ఉంటాడని, అతని అడుగులు చాలా పెద్దవిగా ఉంటాయని, విచిత్రమైన ఆకారంలో కురూపిలా ఉంటాడని కొంత మంది చెబుతూ ఉంటారు.అది ఎంత వరకు వాస్తవమో అనేది పక్కన పెడితే తాజాగా హిమాలయాలలో అరుదైన సంఘటన ఎదురైంది.

హిమాలయ పర్వతాల్లో తొలిసారిగా మంచుమనిషి యతి పాదముద్రలను కనుగొన్నట్టు భారత సైన్యం సోమవారం ట్వీట్‌ చేసింది.ఏప్రిల్ 9వ తేదీన హిమాలయాల్లోని మాకులా బేస్‌ క్యాంప్‌ సమీపంలో భారత ఆర్మీకి చెందిన పర్వతాధిరోహణ బృందం పౌరాణిక మృగంగా భావించే యతి పాదముద్రలు కనుగొన్నదని, యతీ పాదముద్రలు 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నాయని, మాకులా-బరూన్‌ జాతీయ పార్కు సమీపంలో అత్యంత అరుదుగా ఈ మంచుమనిషి కనిపించేదని ఆర్మీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది.

Advertisement

అయితే ఆ మంచు మనిషి అశ్వద్దామా అయి ఉంటాడని ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు