బైడెన్ టీమ్‌లోకి మరో కాశ్మీరీ మహిళ..!!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన టీమ్‌లో మరో భారత సంతతి మహిళకు స్థానం కల్పించారు.అది కూడా కాశ్మీరీ అమ్మాయి కావడం గమనార్హం.

ఇప్పటికే కాశ్మీర్‌కు చెందిన ఈషా షాకు వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్‌గా కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుత నియామకానికి వస్తే.

భారత సంతతికి చెందిన సమీరా ఫాజిలిని నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్‌ (ఎన్ఈసీ) డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.గురువారం బైడెన్ కార్యాలయం ఈ నియామకానికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు.

న్యూయార్క్‌లోని విలియమ్స్‌విల్లేలో సమీరా ఫాజిలి జన్మించారు.ఆమె తల్లిదండ్రులు యూసఫ్‌, రఫీకా ఫాజి.

Advertisement

ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె.హార్వర్డ్‌ కాలేజీ, యేల్‌ లా స్కూల్‌ నుంచి ఉన్నత విద్య పూర్తిచేశారు.యేల్‌ లా స్కూళ్లో లెక్చరర్‌గా కెరీర్‌ ఆరంభించిన ఆమె కన్జ్యూమర్‌, హౌసింగ్, చిన్న తరహా వ్యాపారాలు, మైక్రోఫైనాన్స్‌ తదితర విభాగాల్లో పనిచేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అనుచరురాలిగా సమీరా గుర్తింపు పొందారు.ఫాజిలి గతంలో.అట్లాంటా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు ఆర్థికాభివృద్ధి డైరెక్టర్‌గా పనిచేశారు.

అలాగే ఎన్‌ఈసీ సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించారు.అదే విధంగా ఒబామా హయాంలో డొమెస్టిక్‌ ఫినాన్స్‌, విదేశీ వ్యవహారాల సీనియర్‌ అడ్వైజర్‌గా వ్యవహరించారు.

ఇప్పటికే బైడెన్ కేబినేట్‌లో డజన్‌కు పైగా భారత సంతతి వ్యక్తులకు చోటు లభించిన విషయం తెలిసిందే.ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌తో పాటు నీరా టాండన్, డా.వివేక్ మూర్తి, వనితా గుప్తా, లైషా షా , సబ్రినా సింగ్ , గౌతమ్ రాఘవన్ , భరత్ రామమూర్తి, వినయ్ రెడ్డి, తరుణ్ చాబ్రా, సుమోనా గుహా, వేదాంత్ పటేల్, శాంతి కలత్తిల్ తదితరులు వున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు