ఆపిల్ ‘డబ్ల్యూడబ్ల్యూడీసీ 21’ స్టూడెంట్ ఛాలెంజ్: విజేతల్లో భారతీయ-అమెరికన్ అమ్మాయి

‘డబ్ల్యూడబ్ల్యూడీసీ 21 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్’ విజేతల్లో భారతీయ-అమెరికన్ విద్యార్థి అభినయ దినేష్ (15) ఎంపికైనట్లు ఆపిల్ ప్రకటించింది.

ఆమె సృష్టించిన గ్యాస్ట్రో ఎట్ హోమ్ అనే యాప్‌కు గాను ఈ గౌరవం వరించింది.

ఈ వేసవిలో అభినయ దీనిని యాప్ స్టోర్‌లో ప్రారంభించాలని యోచిస్తోంది.ఔషధం, సాంకేతికత అంశాలపై మక్కువ వున్న అభినయ వీటిలో తోటి అమ్మాయిలకు సాయం చేస్తోంది.

దీనికి సంబంధించి తన స్వస్థలమైన న్యూజెర్సీలోని నార్త్ బ్రూన్స్‌విక్‌లో ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి ప్రాథమిక అంశాలలో శిక్షణ ఇస్తోంది.తాను ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ వద్దకు వెళ్లానని.

తనను పరీక్షించిన డాక్టర్ ‘‘ pelvic floor disorder ’’ వుందని నిర్థారించారు కానీ .ఈ వ్యాధి నుంచి తాను ఎలా బయటపడాలో మాత్రం చెప్పలేదని అభినయ చెప్పింది.ఈ నేపథ్యంలోనే తన ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘గ్యాస్ట్రో ఎట్ హోమ్’ యాప్.

Advertisement

ఇది జీర్ణాశయ రుగ్మతలు ఉన్నవారికి సమాచారం అందిస్తుందని ఆమె చెప్పింది.గతేడాది, యువతీ యువకులలో కృత్రిమ మేధస్సుపై అభ్యాసం, నైతిక పద్ధతులను పెంపొందించడానికి అభినయ ఇంపాక్ట్ ఏఐ అనే సంస్థను కూడా ప్రారంభించింది.

దీనిలో భాగంగా యువతులకు ప్రోగ్రామింగ్, మెషీన్ లెర్నింగ్ అంశాలను నేర్పడానికి ‘గర్ల్స్ ఇన్ ఏఐ’ అనే ఎనిమిది వారాల కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టింది.

వయసులో తాను చిన్నదానినే అయినా బోధన విషయంలో చాలా పెద్దదానిని అని అభియ వ్యాఖ్యానించింది.హైస్కూల్ విద్య పూర్తి చేసిన తరువాత, అభినయ మెడికల్ స్కూల్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తానని తెలిపింది.తద్వారా వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి కొత్త మార్గాలను కనుగొనవచ్చని అభినయ పేర్కొంది.

జూన్ 7 నుంచి 11 మధ్యకాలంలో ఆల్-వర్చువల్ ‘వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2021’ను నిర్వహిస్తామని ఆపిల్ తెలిపింది.ఈ ఈవెంట్‌లో 35 దేశాలకు చెందిన 350 మంది స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలను ఎంపిక చేసింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది.ఎక్కువ మంది యువతులు దరఖాస్తు చేసుకుని, విజయం సాధించినందుకు తాము గర్వపడుతున్నామని ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ రిలేషషన్ వైస్ ప్రెసిడెంట్ సుసాన్ ప్రెస్కోట్ అన్నారు.

Advertisement

ఈ ఇందులో మరింత పురోగతి సాధించడానికి, నిజమైన లింగ సమానత్వాన్ని చేరుకోవడానికి కృషి చేస్తామని సుసాన్ అన్నారు.

తాజా వార్తలు