కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ సాంగ్ !!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.

ఎన్నికలకు మరో పది రోజులే సమయం ఉండటంతో ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రచారం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్,( Donald Trump ) కమలా హారిస్.

( Kamala Harris ) వారి తరపున మద్ధతుదారులు, అనుచరులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న భారతీయ కమ్యూనిటీ రెండు వర్గాలుగా విడిపోయింది.

అమెరికాలోని ప్రభావవంతమైన ప్రవాస భారతీయ సంస్థలు ట్రంప్, కమలా హారిస్‌లకు వేర్వేరుగా మద్ధతు ప్రకటించాయి.

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి ఓటర్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.మొన్నామధ్య డెమొక్రాటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన అజయ్ భూటోరియా( Ajay Bhutoria ) నాటు నాటు హిందీ వెర్షన్ ‘నాచో నాచో’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హారిస్ - వాల్జ్ ప్రచార చిత్రాలను రూపొందించారు.నాచో నాచో పాట ద్వారా దక్షిణాసియా కమ్యూనిటీతో అనుసంధానం కావడమే తమ లక్ష్యమని అజయ్ జైన్ పేర్కొన్నారు.4.4 మిలియన్ల మంది భారతీయ ఓటర్లు, 6 మిలియన్ల మంది దక్షిణాసియా ఓటర్లు( South Asia Voters ) నవంబర్ 5న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన చెప్పారు.

Advertisement

తాజాగా అజయ్ భూటోరియా మరోసారి స్వింగ్ స్టేట్స్‌లోని దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేందుకు ‘‘ ఐ విల్ వోట్ ఫర్ కమలా హారిస్ - టిమ్ వాల్జ్ ’’ అనే డిజిటివ్ వీడియోను విడుదల చేశారు.బాలీవుడ్ హిట్ మూవీ రోజా మూవీలో మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఐకానిక్ సాంగ్ ‘‘ దిల్ హై సా, ఛోటీ సి ఆషా ’’ ఆధారంగా యానిమల్ మూవీలోని ఇన్‌స్ట్రుమెంటల్ వెర్షన్‌కు సెట్ చేశారు.దీని ద్వారా మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా కమ్యూనిటీతో ఈజీగా కనెక్ట్ కావొచ్చని భావిస్తున్నారు.

కమలా హారిస్‌కు మన మద్ధతును అందించాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.హారిస్ - వాల్జ్ కోసం రాబోయే రోజుల్లో మరిన్ని బాలీవుడ్ సాంగ్స్‌ను కూడా విడుదల చేస్తామని భూటోరియా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు