ముంబైలోని వాఖండే వేదికగా నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.తొలి వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఘోరంగా విఫలమైంది.
అయితే వన్డే సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సిందే.తొలి మ్యాచ్లో భారత జట్టు బ్యాటర్లైన జేమీయా రోడ్రిగ్స్ (82), పూజా వస్త్రాకార్ (62)( Jemimah, Vastrakar ) పరుగులతో రాణించడం వల్ల భారత్ 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
కానీ బౌలర్లు పూర్తిగా విఫలం కావడం వల్ల భారత జట్టు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.ఇంకా మూడు ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయం సాధించింది.

భారత మహిళల జట్టు స్వదేశంలో వరుసగా ఎనిమిదవ సారి పరాజయం పొందింది.తొలి మ్యాచ్లో బౌలర్లు అధిక పరుగులు సమర్పించుకోవడం, చేతికి వచ్చిన క్యాచ్లు మిస్ చేయడం వల్లనే భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.కాబట్టి నేటి మ్యాచ్లో భారత మహిళా జట్టు గెలవాలంటే.బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లను, భారత జట్టు సమర్థవంతంగా కట్టడి చేయాలి.భారత జట్టు ఒకరోజులో ఓటమి నుంచి కోలుకొని మెరుగ్గా రాణించడం అంటే ఒక రకంగా పెద్ద సవాలే.

భారత జట్టు వైస్ కెప్టెన్, కీలక బ్యాట్స్ మెన్ స్మృతి మందాన( Smriti Mandhana ) అనారోగ్యం కారణంగా మొదటి మ్యాచ్ కు దూరం అయిన సంగతి తెలిసిందే.నేడు జరిగే రెండో మ్యాచ్లో స్మృతి మందాన అందుబాటులో ఉండే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.మొదటి వన్డేలో ఉక్కపోత, ఎండా కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న రోడ్రిగ్స్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది స్పష్టత లేని కారణంగా నేటి మ్యాచ్లో అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు.







