దేశాన్ని ' లాక్ ' చేస్తున్నారా ? ఎప్పటి నుంచి ?

కరోనా పెడుతున్న కంగారు అంతా ఇంతా కాదు.ప్రపంచమంతా ఈ మహమ్మారి కారణంగా అల్లాడిపోతోంది.

సర్వం సర్వ నాశనం అయ్యాయి అన్నట్టుగా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి.జనాలంతా కరోనా కాటు కారణంగా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ప్రపంచం సంగతి ఎలా ఉన్నా, భారత్ లో పరిస్థితి మాత్రం చేయి దాటి పోతుంది అన్నట్టుగా ఉంది.ముఖ్యంగా లాక్ డౌన్ నిబంధనలులో ఎప్పుడైతే సడలింపులు ఇచ్చారో అప్పటి నుంచి పరిస్థితి అదుపు తప్పింది.

జనాలంతా రోడ్లపైకి విచ్చలవిడిగా రావడం, గుంపులుగా తిరుగుతూ ఉండటం వంటి కారణాలతో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మరింతగా పెరిగిపోయాయి.రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Advertisement

అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి అదుపు తప్పడం, కొన్ని రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేయలేక చేతులెత్తేయడం వంటి ఎన్నో కారణాల ను కేంద్రం పరిగణలోకి తీసుకుంది.గత కొద్ది రోజులుగా పరిస్థితి మరింతగా అదుపు తప్పినట్లు కేంద్రం గుర్తించింది.కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు గా సంకేతాలు అందుతుండడంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది.

దేశవ్యాప్తంగా మరో సారి ఒక నెల రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తే పరిస్థితి కాస్త అదుపులోకి వస్తుందని, లేకపోతే దేశం మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.ఇప్పటికే ఈ నెలాఖరు వరకు మాత్రమే రైళ్లు నడుపుతామని, రైల్వే శాఖ ప్రకటించింది.

ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని రైల్వే శాఖ నుంచి ప్రకటన రావడంతో అందరిలోనూ సందేహాలు పెరిగిపోతున్నాయి.

నెలాఖరులోపు అందరూ ఎవరి ప్రాంతాలకు వెళ్లి పోవాలని సంకేతాలను కేంద్రం ఈ విధంగా ఇస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జూలై 1 నుంచి లాక్ డౌన్ విధించే అవకాశం ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొద్ది రోజుల క్రితం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో లాక్ డౌన్ విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరగగా, అప్పట్లో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించవద్దని కోరాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

మళ్ళీ ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పినట్టుగా కనిపిస్తుండడంతో కేంద్రాన్ని మళ్లీ డౌన్ విధించాలని కోరుతున్నాయట.ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోతుంది అనే అభిప్రాయాలు అన్ని రాష్ట్రాలు వ్యక్తం చేస్తుండడంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు