ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాది, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurpatwant Singh Pannu ) హత్యకు కుట్ర జరిగిందంటూ కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.దీనిని అమెరికా భగ్నం చేసినట్లుగా ఈ కథనం పేర్కొంది.
అయితే పన్నూ హత్యకు కుట్రలో నిఖిల్ గుప్తా అనే వ్యక్తి ప్రమేయం వుందంటూ ఇటీవల అమెరికా అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది.
నిఖిల్ గుప్తాను( Nikhil Gupta ) ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్( Czech Republic ) అధికారులు అరెస్ట్ చేయగా.
అతడిని తమకు అప్పగించాలంటూ అగ్రరాజ్యం ఆ దేశంపై ఒత్తిడి తెస్తోంది.మరోవైపు నిఖిల్ అరెస్ట్, తదితర అంశాలపై భారత్( India ) స్పందించింది.నిఖిల్‌కు తమ దేశం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని, అమెరికా( America ) వద్ద దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని భారత ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి.అలాగే నిఖిల్ గుప్తాకు న్యాయ సహాయం అందిస్తామని తెలిపాయి.
ఒకవేళ ఈ కేసులో అతని ప్రమేయం ఉందని తేలితే నిఖిల్ గుప్తాకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

అయితే పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న అమెరికా ఆరోపణలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) స్పందించారు.ఈ ఘటన తాము చెబుతున్న అంశాలకు మరింత బలం చేకూరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.తాము ఈ సమస్యను చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని విదేశాంగ కార్యదర్శి భారత విదేశాంగ మంత్రితో నేరుగా ప్రస్తావించారని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి ఇటీవల మాథ్యూ మిల్లర్( Matthew Miller ) తన రోజువారీ విలేకరుల సమావేశంలో అన్నారు.
వారు (భారతదేశం) బహిరంగంగా విచారణ చేస్తామని ప్రకటించారని.

ఆ ఫలితాల కోసం తాము వేచి చూస్తామని మిల్లర్ పేర్కొన్నారు.అలాగే హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం వుందన్న ఆరోపణలపై కెనడా చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని భారత్‌ను తాము కోరినట్లు మిల్లర్ వెల్లడించారు.ఈ క్రమంలో భారత్‌కు మూడుసార్లు కాన్సులర్ యాక్సెస్ లభించింది.
అతనికి అవసరమైన కాన్సులర్ సాయాన్ని అందిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి( Arindam Bagchi ) పేర్కొన్నారు.యూఎస్ ఏజెన్సీల నుంచి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా చేసిన ఆరోపణలను సైతం భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని బాగ్చి స్పష్టం చేశారు.







