ఆసియా మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) లో భాగంగా తాజాగా పాకిస్తాన్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది.ఏకంగా 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించింది.
శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్ ఏ – పాకిస్తాన్ ఏ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ కు దిగింది.పాకిస్తాన్( Pakistan ) బ్యాటర్లైన కాసిం అక్రం 48, షాహిజాదా ఫర్హాన్ 35, ముబాసిర్ ఖాన్ 28, హసీబుల్లా ఖాన్ 27, మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులు చేశారు.
మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు నమోదు చేయలేకపోవడంతో పాకిస్తాన్ జట్టు 48 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
భారత బౌలర్లైన హంగేర్గకర్ ఐదు వికెట్లు, మానవ్ 3 వికెట్లు.రియాన్ పరాగ్, నిషాంత్ సింధు చెరో ఒక్క వికెట్ తీశారు.అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత జట్టు మొదటి నుండే దూకుడుగా ఆటను ప్రారంభించింది.
భారత జట్టు ప్లేయర్ సాయి సుదర్శన్( Sai Sudharsan ) 10 ఫోర్లు, మూడు సిక్స్ లతో 14 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
నికిన్ జోస్ 7 ఫోర్ లతో చెలరేగి 53 పరుగులు చేశాడు.భారత్ 36.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి సుదర్శన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.ఈ టోర్నీలో భారత ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం.
భారత జట్టు ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.టోర్నీలో పాల్గొన్న జట్లలో భారత్ కాకుండా మిగిలిన అన్ని జట్లు ఏదో ఓ మ్యాచ్లో ఓటమిని చవిచూశాయి.