కెనడా : గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత ప్రభుత్వం

భారత వ్యతిరేక సంస్థలు, వ్యక్తులపై నరేంద్ర మోడీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్‌కు దిగింది.తాజాగా కెనడా( Canada ) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పంజాబీ గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ను( Goldy Brar ) భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.

 India Declares Canada-based Gangster Goldy Brar A Terrorist Details, India ,cana-TeluguStop.com

దీనికి సంబంధించి హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా( Terrorist ) ప్రకటించింది.

ఏఎన్ఐ వార్తాసంస్థ నివేదిక ప్రకారం భారత్‌కు వెలుపల నుంచి డ్రోన్‌లు, హై గ్రేడ్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్ధాలను అక్రమంగా రవాణా చేయడం , కిరాయి హత్యలు, షార్ప్‌షూటర్‌లను అందించడం వంటి అభియోగాలపై గోల్డీ బ్రార్ ప్రమేయం వున్నట్లుగా హోంశాఖ తెలిపింది.

యూఏపీఏలోని సెక్షన్ 35లోని సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (ఏ) ద్వారా అందించిన అధికారాలను అమలు చేస్తున్నట్లు హోంశాఖ పేర్కొంది.

నాల్గవ షెడ్యూల్‌లో అతని పేరును 56వ ఉగ్రవాదిగా చేర్చినట్లు హోం మంత్రిత్వశాఖ( Ministry Of Home Affairs ) తెలిపింది.బ్రార్ అతని అనుచరులు పంజాబ్‌లో( Punjab ) శాంతి, మత సామరస్యం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నినట్లుగా హోంశాఖ పేర్కొంది.

విధ్వంసం, టెర్రర్ మాడ్యూళ్లను పెంచడం, టార్గెట్ కిల్లింగ్స్, ఇతర దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఈ గ్యాంగ్ పాల్పడుతున్నట్లు తెలిపింది.

Telugu Canada Gangster, Goldy Brar, India, Punjab Gangster, Sidhu Moosewala, Ter

ఎవరీ గోల్డీ బ్రార్:

ఇతని అసలు పేరు సతీందర్ సింగ్.( Satinder Singh ) పంజాబ్ రాష్ట్రంలోని ముక్త్‌సర్ సాహిబ్ ప్రాంతానికి చెందిన వాడు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బిష్ణోయ్ తరపున గోల్డీ బ్రార్ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్‌కి.( Lawrence Bishnoi ) మరో గ్యాంగ్‌స్టర్ దవిందర్ బంభిహాకు మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది.పంజాబ్ సహా ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో రెండు గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి.

Telugu Canada Gangster, Goldy Brar, India, Punjab Gangster, Sidhu Moosewala, Ter

గోల్డీ బ్రార్ సన్నిహితుడు, విద్యార్ధి నేత మిద్దుఖేరాను బంభిహా గ్యాంగ్ హతమార్చింది.దీనికి ముందు బ్రార్ సమీప బంధువు గుర్లాల్ బ్రార్ కూడా హత్యకు గురయ్యాడు.ఇతను బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ హత్యకు ప్రతీకారంగా కాంగ్రెస్ నేత గురులాల్ పహిల్వాన్‌ను లారెన్స్ గ్యాంగ్ హత్య చేసింది.ఈ కేసులో కీలక నిందితుడిగా వున్న గోల్డీ బ్రార్ కెనడాకు పారిపోయాడు.

పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా( Sidhu Moosewala ) హత్య కేసులోనూ గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడు.సిద్ధూని హతమార్చేందుకు వ్యూహ రచన, దానిని అమలు చేయడం, షూటర్లకు ఆయుధాలు పంపడం వంటి విషయాలను బ్రార్ పర్యవేక్షించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.

ప్రస్తుతం గోల్డీ బ్రార్ కెనడాలోని బ్రాంప్టన్‌లో వున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube