భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( Ind vs Aus ) మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా తాజాగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ( Prasidh Krishna ) ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న టాప్-5 బౌలర్లలో చేరాడు.ఆస్ట్రేలియా మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న టాప్-5 బౌలర్లు ఎవరు చూద్దాం.
శ్రీలంక జట్టు బౌలర్ కసూన్ రజిత( Kasun Rajitha ) 75 పరుగులు సమర్పించుకొని ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.స్కాట్లాండ్ జట్టు బౌలర్ క్రిస్ సోలే( Chris Sole ) 72 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.
తుర్కియే జట్టు బౌలర్ టురన్( Tunahan Turan ) 70 పరుగులు సమర్పించుకుని మూడవ స్థానంలో ఉన్నాడు.ఐర్లాండ్ బౌలర్ బారీ మెక్ కార్తీ( Barry McCarthy ) 69 పరుగులతో నాలుగవ స్థానంలో ఉన్నాడు.

సౌత్ ఆఫ్రికా బౌలర్ అబాట్,( Kyle Abbott ) భారత జట్టు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 68 పరుగులతో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు.మూడవ టీ20 మ్యాచ్ లో భారత్ గెలిచి ఆడాల్సి ఉన్న మరో రెండు మ్యాచులు ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుందని అంతా భావించారు.అనుకున్న విధంగానే టాస్ ఓడిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 222 భారీ పరుగులు చేసింది.

కానీ భారత జట్టు ఫీల్డింగ్ కు వచ్చే సరికి పేలవ ఆటను ప్రదర్శించింది.భారత జట్టు బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్నిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవం చేసుకుంది.
ఈ సిరీస్ లో నాల్గవ టీ20 మ్యాచ్ ఛత్తీస్గఢ్ లోని రైపూర్ వేదికగా శుక్రవారం జరగనుంది.ఈ మ్యాచ్లో భారత జట్టు బౌలర్లు పుంజుకుని రాణించల్సిన అవసరం ఉంది.







