సాయిరెడ్డి టైమ్ స్టార్ట్ అయ్యిందా ? 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టైం మళ్లీ వైసీపీలో స్టార్ట్ అయింది.

మొన్నటి వరకు జగన్ ఆయనకు పెద్దగా ప్రాధాన్యమివ్వనట్టుగా కనిపించినా,  ఇప్పుడు మాత్రం ఆయనకు మంచి ప్రాధాన్యం ఉన్న పదవిని అప్పగించారు .

వైసీపీ అనుబంధ సంఘాలకు ఇన్ఛార్జిగా ఆయనను నియమించారు.దీంతో ఇక పూర్తిగా పార్టీపై ఆయన మార్క్ కనిపించబోతోంది.

ఇప్పటివరకు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్చార్జిగా మాత్రమే కొనసాగుతూ వస్తున్నారు.  దీంతో జగన్ ఆయనను పక్కన పెట్టారని మొదట్లో ఇచ్చినంత ప్రాధాన్యం ఇప్పుడు ఇవ్వడం లేదని,  అందుకే కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే విజయసాయిరెడ్డి సేవలను పరిమితం చేశారని, వైసిపి ప్రత్యర్ధుల తోపాటు, సొంత పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి పై సెటైర్లు వేసే వారు.

దీనికి తగ్గట్లుగానే జగన్ ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి కి ప్రాధాన్యం ఇవ్వడం , వైసిపి కి సంబంధించిన ఏ విషయం పైన అయినా సజ్జల  మాత్రమే స్పందించడం వంటి కారణాలతో విజయసాయి పాత్ర నామమాత్రమే అని అంతా భావించగా,  జగన్ మాత్రం విజయసాయి ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు.       ఇక ఇప్పుడు పార్టీలో తనకు లభించిన కొత్త పదవితో విజయసాయిరెడ్డి మరింత దూకుడు చూపించబోతున్నారట.ముందుగా పార్టీలో ఎక్కడికక్కడ నెలకొన్న గ్రూపు రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం ప్రతి నియోజకవర్గంలోనూ 2, 3 గ్రూపులు ఉండడం , ఈ వ్యవహారాల కారణంగా ప్రత్యర్ధులు బలం పెంచుకోవడం, ఎక్కడికక్కడ క్రమశిక్షణ తప్పి నాయకులు వ్యవహరిస్తుండడం,    

Advertisement

   ఈ వ్యవహారాలు అన్నిటి పైన ఇప్పుడు పూర్తిగా దృష్టి సారించబోతున్నారట .ఇక అనుబంధ సంఘాలన్నిటినీ ఏకం చేసి రాజకీయ ప్రత్యర్థులపై అన్ని విధాలుగా పోరాడేందుకు అస్త్రాలను విజయసాయి సిద్ధం చేసుకుంటున్నారట.ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికల్ని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు.

దీనికి తగ్గట్లుగానే వైసిపి విజయావకాశాలను మెరుగుపరిచేందుకు పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు నాయకులను సమన్వయం చేస్తూ,  పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు విజయసాయి మరింత దూకుడు చూపించబోతున్నారట.

Advertisement

తాజా వార్తలు