ఆ రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో లాక్ డౌన్..!!

దేశంలో ఊహించనివిధంగా కరోనా వైరస్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి.

వైరస్ పాజిటివ్ కేసులు బాగా బయటపడుతున్న వైరస్ విజృంభిస్తున్న ఢిల్లీ, గుజరాత్, మహా రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తూ ఉన్నాయి.

ఇప్పుడు ఇదే జాబితాలో కి మధ్యప్రదేశ్ కూడా చేరిపోయింది.శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పట్టణాలలో లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించారు.

ముఖ్యంగా రాష్ట్రంలో పెద్ద నగరాలలో భారీ ఎత్తున ఐదు కేసులు పెరుగుతుండటంతో కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు కరోనా వల్ల నాలుగు వేల మంది మరణించడం జరిగింది.

దీంతో సెకండ్ వేవ్ దేశంలో మొదలు కావడంతో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. .

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు