ఇప్పుడు ఏపీలో ఎవరి హవా సాగుతోంని చెప్పాలంటే ఒకే ఒక్క పేరు అందరికీ గుర్తుకు వస్తుంది.అదే వైసీపీ.
ఆ పార్టీ హవా మహామహులు సైతం పల్టీలు కొడుతున్నారు.ఇక వరుస ఎన్నికల్లో విజయ భేరీ మోగిస్తున్న వైసీపీ ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో కూడా అంతకు మించి విజయాన్ని నమోదు చేసింది.
ఏకంగా టీడీపీకి కంచు కోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా జెండా ఎగరేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుప్పంలోనే టీడీపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిందంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క చంద్రబాబు నియోజకవర్గంలోనే కాకుండా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న చాలా వరకు నియోజకవర్గాల్లో ఇలాగే ఢీలా పడింది.అసలు కుప్పం అంటే చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టే నియోజకవర్గం.
గతంలో అయితే కుప్పం నియోజకవర్గంలో కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్విప్‌చేసింది.కానీ ఇప్పుడు మాత్రం పట్టు నిలుపుకోలేక అడ్రగ్ గల్లంతు చేసుకుందంటేనే ఎంత దారుణంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తోంది.
ఇకపోతే టీడీపీకి ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఎంపీటీసీ, జడ్పీటీసీలు గెలవలేదు.

ఇక రాయలసీమలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.ఏకంగా బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హిందూపురం టీడీపీ దారుణంగా ఓడిపోయింది.ఇక పరిటాల వారికి పట్టున్న రాప్తాడులో, జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా గెలిచిన తాడిపత్రి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అడ్రస్ లేకుండా గల్లంతు అయిపోయిందంటేనే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.ఇక దీన్ని కప్పి పుచ్చుకునేందుకు చాలాచోట్ల తాము ఎలక్ష్లను బహిష్కరించామని కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఓడిపోయిన టీడీపీ నేతలు.
మొత్తంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ పట్టు కోల్పోయిందని తెలుస్తోంది.
.