ఏం భయంలేదు, ధైర్యంగా ఉండండి.. అంటున్న ఢిల్లీ సీఎం..!!

ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తూ ఉండటంతో ప్రపంచ దేశాలు గడగడలాడి పోతున్నాయి.

ఆఫ్రికా దేశం లో ఈ కొత్త వైరస్ వెలుగులోకి రావడంతో.

ప్రపంచ దేశాలు ఆఫ్రికా దేశం కి సంబంధించి రాకపోకలు విషయంలో తీవ్ర ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి.ఒమిక్రాన్ ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఇప్పటికే రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని కేసులు కూడా ముంబై ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండే చోట నమోదు కావడం జరిగింది.

ఇటువంటి తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.ఒమిక్రాన్ విషయంలో ప్రజలు ధైర్యంగా ఉండాలని భయపడాల్సిన అంత విషయమేమీ కాదని.కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించడం తో పాటు భౌతిక జీవనం పాటించాలని.

Advertisement

ప్రజలకు సూచించారు.ఇక ఇదే సమయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కేజ్రీవాల్ కోరడం జరిగింది.

ఇదే సమయంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ స్పందిస్తూ ఒమిక్రాన్.ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుండి వస్తున్న ప్రయాణికుల విషయంలో విమానాశ్రయంలో అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అడుగడుగున జల్లెడ పడుతూ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల విషయంలో.చాలా జాగ్రత్తగా ఉన్నామని స్పష్టం చేశారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు