అమెరికాలో మళ్ళీ పేలిన తూటా – నలుగురు మృతి

అమెరికాలోని కాన్సాస్ లో గల ఓ బార్ లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా , ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఒక్క సారిగా జరిగిన ఈ మెరుపు దాడి ఘటనతో చాలా మంది అమెరికన్స్ షాక్ లోనే ఉన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే.

కాన్సాస్ నగరంలోని టెక్విలా అనే బార్ లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు.బార్ లో ఉన్నవారితో గొడవకి దిగారు.

తీవ్ర వాగ్వాదం అనంతరం వారు బయటకి వెళ్లి తుపాకులతో తిరిగి వచ్చారని వచ్చీ రాగానే కాల్పులు ప్రారంభించారని తెలుస్తోంది.ఆ సమయంలో బార్ లో సుమారు 40 మందికి పైగా ఉన్నారని.

Advertisement

అయితే చనిపోయిన మృతులు అందరూ స్పానిష్ మాట్లాడేవారని పోలీసులు తెలిపారు.వారిపై ఈ దాడి కావాలనే జరిగినట్టుగా తెలుస్తోందని,కానీ ఇది జాత్యహంకార దాడిగా ఇప్పుడే చెప్పలేమని ధామస్ అనే అధికారి తెలిపారు.

 ఇదిలాఉంటే టెక్విలా అనేది ప్రవైటు క్లబ్ అని, ఇందులోకి సభ్యులు మాత్రమే రావాల్సి ఉందని, లోపలి ఎవరు వెళ్తున్నారో చూసుకోవాల్సిన భాద్యత బార్ నిర్వాహకులదేనని అన్నారు.ఈ దుండగులు బార్ లో సభ్యులా లేక, బయట నుంచీ వచ్చిన వారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, సీసీ టీవీ పుటేజ్ లు కూడా పరిశీలిస్తున్నామని ధామస్ ప్రకరించారు.

Advertisement

తాజా వార్తలు