నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నకిలీ నోట్లు కలకలం రేపింది.ప్రతి సోమవారం భైంసా పట్టణంలో కూరగాయల మార్కెట్ ఉంటుంది.
సోమవారం వచ్చిందంటే చాలు ఆ రోడ్డంతా ప్రజలతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది.ఇదే అదునుగా భావించిన ఓ బాలుడు ఎవరు గుర్తుపట్టారా అనుకున్నాడో ఏమో గాని, నకిలీ కూరగాయలను కొనే ప్రయత్నం చేసాడు.
ముందుగా తన వద్ద ఉన్న నకిలీ 500 రూపాయల నోటుతో బజారులో వ్యాపారం నిర్వహిస్తున్న ప్రవీణ్ అనే వ్యాపారి వద్దకు వచ్చి 20 రూపాయల కూరగాయలను కొనుగోలు చేసి 480 రూపాయల చిల్లర తీసుకెళ్లాడు.కాసేపటికే మళ్ళీ 500 రూపాయల నోటు తీసుకొని వచ్చి మళ్ళీ కూరగాయలు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా తాను ఇచ్చిన 500 రూపాయల నోటుపై వ్యాపారి ప్రవీణ్ కు అనుమానం వచ్చి బాలున్ని ప్రశ్నించే లోపే బాలుడు అక్కడి నుండు పరారయ్యాడు.
ఈ విషయమై వ్యాపారి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదుచేయగా అక్కడికి చేరుకున్న భైంసా పట్టణ ఎస్సై తిరుపతి 500 రూపాయల నోట్లను పరిశీలించారు.నకిలీ నోట్ల చలామణిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.







