తెలంగాణలో సాధారణ ఎన్నికలకు కేవలం ఆరు నెలలు మాత్రమే సమయం ఉండడంతో అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహరచనలో మునిగి తెలుతోంది.ఈసారి కూడా గెలిచి ముచ్చటగా మూడవసారి అధికారాన్ని చేపట్టాలని కేసిఆర్ భావిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు.అయితే ఈసారి బీజేపీతో బిఆర్‌ఎస్( Brs ) కు బలమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే 2018 తరువాత నుంచి మారుతున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.దుబ్బాక, హుజూరాబాద్, ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్ కు షాక్ ఇచ్చింది.
అలాగే జిహెచ్‌ఎంసి( GHMC ) ఎన్నికల్లోనూ, మునుగోడు ఎన్నికల్లోనూ గెలిచినంత పని చేసింది.

అందువల్ల వచ్చే ఎన్నికల్లో బీజేపీతో బిఆర్‌ఎస్ కు ఎంతో కొంత ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.దాంతో పక్కా ప్రణాళికబద్ధంగా వ్యూహాలు రచిస్తే తప్ప బిఆర్‌ఎస్ గట్టెక్కే పరిస్థితులు లేవనేది కొందరి అభిప్రాయం.మరి మారుతున్న రాజకీయ సమీకరణలను ఆధారంగా కేసిఆర్( KCR ) ఎలాంటి వ్యూహలు రచించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరం.

అయితే సీట్ల కేటాయింపు విషయంలో కేసిఆర్ అనుసరిస్తున్న విధానం ఆ పార్టీ నేతలనే కలవరపెడుతోంది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని, ప్రజాధరణ లేని వాళ్ళను పక్కన పెడతామని గులాబీ బాస్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఎవరెవరికి సీట్లు దక్కుతాయి ? ఎవరిని పక్కన పెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది.

అయితే ఇతర పార్టీల నుంచి బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న వారికి సికేఆర్ సీటు ఇస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరమే.సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యం అని తేల్చి చెప్పడంతో పార్టీ పిరాయింపులకు పాల్పడిన వారికి నిరాశ తప్పదనే వాదన వినిపిస్తోంది.అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కేసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఏమాత్రం మొండి చేయి చూపిస్తే వారంతా పక్క పార్టీలవైపు చూస్తే అవకాశం ఉంది.
అలాగే కొత్తవారికి ఆయా నియోజిక వర్గాల్లో ఎంతమేర పట్టు ఉందనేది కూడా ప్రశ్నార్థకమే ! ఈ నేపథ్యంలో కేసిఆర్ రిస్క్ చేయకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకే అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని.ఇది పక్కా కేసిఆర్ ఎలక్షన్ స్ట్రాటజీ అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
మరి ఎన్నికల నాటికి కేసిఆర్ కేసిఆర్ వ్యూహ రచనా ఇలాగే ఉంటుందా ? లేదా అనేది చూడాలి.







