మాజీ మంత్రుల్లో వణుకు.. మాయమవుతున్న ఫైళ్లు ?

తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, మాజీ మంత్రుల కార్యాలయాల్లోనూ కీలకమైన పత్రాలు ఆకస్మాత్తుగా మాయం అవడం, లేదా కాల్చివేయడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఏర్పడిన తరువాత మాజీ మంత్రుల కార్యాలయాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయల్లోనూ కీలకమైన ఫైళ్లు( Important Files ) కొన్ని మాయమవడం లేదా, అగ్ని ప్రమాదానికి గురై దగ్ధం అవడం వంటివి సంచలనంగా మారాయి.

 Important Files Missing From Former Brs Ministers Offices Details, Telangana Ele-TeluguStop.com
Telugu Brs Ministers, Srinivas Goud, Telangana, Telangana Brs-Politics

గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి అన్ని శాఖలలోను చోటుచేసుకుందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వంలో వాటిని బయటకు తీసి జైలుకు పంపుతానే భయంతోనే ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు( Srinivas Goud ) రవీంద్రభారతిలో ఓ ఆఫీసు ఉండేది.బీఆర్ఎస్ ఓటమి చెందగానే శ్రీనివాస్ గౌడ్ తన ఆఫీసును ఖాళీ చేశారు.ఈ సమయంలో కొంతమంది చూసి వాటిని అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది.ఇదే విధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) పీఏ ఒకరు పశుసంవర్ధక శాఖలోని ఫైళ్లను తరలిస్తూ పట్టుబడ్డారు.

Telugu Brs Ministers, Srinivas Goud, Telangana, Telangana Brs-Politics

ఇదేవిధంగా మరో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Sabita Indra Reddy ) ఆఫీసులోనూ కీలకమైన ఫైళ్లు మాయం అయ్యాయి.అలాగే మరి కొంతమంది మాజీ మంత్రుల కార్యాలయల్లోనూ ఫైళ్లు మాయం కావడం, కొంతమంది కీలక అధికారులు కీలకమైన ఫైళ్లను మాయం చేయడం వంటి వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.  బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందనే నమ్మకంతో ఈ ఫైళ్ళ వ్యవహారాన్ని అంతగా పట్టించుకోలేదని,  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం,  రేవంత్ రెడ్డి ఏ విషయంలోనూ తమను వదిలిపెట్టే ప్రసక్తి లేదని భావిస్తున్న నేతలు ఈ విధంగా ఫైళ్ళ  తరలింపునకు, దహనానికి పాల్పడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ వ్యవహారాలు రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఇప్పుడు వాటిపైన దృష్టి సారించబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube