మాజీ మంత్రుల్లో వణుకు.. మాయమవుతున్న ఫైళ్లు ?

తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, మాజీ మంత్రుల కార్యాలయాల్లోనూ కీలకమైన పత్రాలు ఆకస్మాత్తుగా మాయం అవడం, లేదా కాల్చివేయడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఏర్పడిన తరువాత మాజీ మంత్రుల కార్యాలయాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయల్లోనూ కీలకమైన ఫైళ్లు( Important Files ) కొన్ని మాయమవడం లేదా, అగ్ని ప్రమాదానికి గురై దగ్ధం అవడం వంటివి సంచలనంగా మారాయి.

"""/" / గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి అన్ని శాఖలలోను చోటుచేసుకుందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వంలో వాటిని బయటకు తీసి జైలుకు పంపుతానే భయంతోనే ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

 ముఖ్యంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు( Srinivas Goud ) రవీంద్రభారతిలో ఓ ఆఫీసు ఉండేది.

బీఆర్ఎస్ ఓటమి చెందగానే శ్రీనివాస్ గౌడ్ తన ఆఫీసును ఖాళీ చేశారు.ఈ సమయంలో కొంతమంది చూసి వాటిని అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది.

ఇదే విధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) పీఏ ఒకరు పశుసంవర్ధక శాఖలోని ఫైళ్లను తరలిస్తూ పట్టుబడ్డారు.

"""/" / ఇదేవిధంగా మరో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Sabita Indra Reddy ) ఆఫీసులోనూ కీలకమైన ఫైళ్లు మాయం అయ్యాయి.

అలాగే మరి కొంతమంది మాజీ మంత్రుల కార్యాలయల్లోనూ ఫైళ్లు మాయం కావడం, కొంతమంది కీలక అధికారులు కీలకమైన ఫైళ్లను మాయం చేయడం వంటి వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

  బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందనే నమ్మకంతో ఈ ఫైళ్ళ వ్యవహారాన్ని అంతగా పట్టించుకోలేదని,  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం,  రేవంత్ రెడ్డి ఏ విషయంలోనూ తమను వదిలిపెట్టే ప్రసక్తి లేదని భావిస్తున్న నేతలు ఈ విధంగా ఫైళ్ళ  తరలింపునకు, దహనానికి పాల్పడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ వ్యవహారాలు రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఇప్పుడు వాటిపైన దృష్టి సారించబోతున్నట్లు సమాచారం.

తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న స్టార్ డైరెక్టర్…