హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.ఈ మేరకు ఓఆర్ఆర్ పై కొత్త స్పీడ్ లిమిట్స్ పై సైబరాబాద్ పోలీసులు నోటిఫికేషన్ జారీ చేశారని తెలుస్తోంది.
దీని ప్రకారం లేన్ 1 మరియు 2 లో 100 నుంచి 120 కిలోమీటర్లకు స్పీడ్ లిమిట్ పెరిగింది.దాంతో పాటు లేన్ 3 మరియు 4లో 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్, ఐదవ లేన్ లో 40 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ పెంచారు.
అదేవిధంగా 40 కిలోమీటర్ల స్పీడ్ కు తక్కువ వెళ్లే వాహనాలతో పాటు పాదచారులకు అనుమతి లేదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.