తెలంగాణ బీజేపీ( BJP ) గత కొన్నాళ్లుగా అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతోంది.ఎన్నికల ముందు నేతల మద్య విభేదాలతో ఊహించని పరిణామాలను ఎదుర్కొంటోంది.
కేవలం నేతల్లోనే కాకుండా పార్టీలోని కొందరి పై కార్యకర్తలు కూడా అసహనంగా ఉండడం ఆపార్టీని మరింత కలవరపెడుతున్న అంశం.అయితే ఇటీవల పార్టీలో కీలక మార్పులు చేసిన అధిష్టానం కొంతవరకు నేతల్లోని అసంతృప్తిని పారద్రోలే ప్రయత్నం చేసింది.
అయినప్పటికి కొందరి నేతల పట్ల పార్టీ కార్యకర్తలు తీవ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ అర్వింద్( MP Arvind ) పై నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నారు.ప్రత్యర్థి పార్టీ నేతలపై తనదైన రీతిలో విమర్శలు గుప్పించే అర్వింద్ ను పార్టీ సోషల్ మీడియా చైర్మెన్ గా నియమించింది అధిష్టానం.అయితే నిజామాబాద్( Nizamabad ) జిల్లాలో మండల అధ్యక్షుల విషయంలో అరవింద్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎలాంటి సమాచారం లేకుండా నాలుగు సెగ్మెంట్లలో మండలద్యక్షులను తొలగించడం ఏంటని కొంతమంది అరవింద్ పై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు.
ఈ అంశం కాస్త చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలు డిల్లీ ( Delhi )అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది.ఇక పోతే జిల్లా లో ఎంపీ అరవింద్ పై గత కొన్నాళ్లుగా సొంత పార్టీ నేతలే వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు.దీంతో కొందరు బీజేపీని వీడే ఆలోచనలో కూడా ఉన్నారట.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో నిలవాలని చూస్తున్న అరవింద్ కు జిల్లాలో ఏర్పడిన వ్యతిరేకత గట్టిగానే దేబ్బ తీసే అవకాశం ఉంది.మరి నిజామాబాద్ జిల్లాలో ఏర్పడిన లుకలుకలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
మొత్తానికి ఒక్క నిజామాబాద్ లోనే కాకుండా చాలా నియోజిక వర్గాల్లో పార్టీ కార్యకార్యకర్తలు పెద్దగా యాక్టివ్ గా లేరని టాక్ నడుస్తోంది.మరి నియోజిక వర్గాల వారీగా పార్టీ బలోపేతం కోసం అధిస్థానం ఎలాంటి కసరత్తులు చేస్తుందో చూడాలి.







