కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ సర్వే( Karnataka Assembly Elections ) ఫలితాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఒకటి రెండు మీడియా సంస్థలు కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ సర్వే ఫలితాన్ని ఇవ్వడం జరిగింది.
కానీ ఎక్కువ శాతం మీడియా సంస్థలు మాత్రం కర్ణాటక లో హంగ్ ప్రభుత్వం రాబోతుంది అంటూ జోష్యం చెప్పడం జరిగింది.కానీ కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా చాటింది.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ( Congress Party ) పని అయిపోయింది అంటూ బిజెపి వాళ్లు ప్రచారం చేస్తున్న ఈ సమయంలో కర్ణాటకలో భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుని సొంతంగా అధికారాన్ని దర్శించుకోవడంతో ఆ పార్టీకి బూస్ట్ దక్కినట్లు అయింది.ఈ విజయానికి కారణం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర( Bharat Jodo Yatra ) అంటూ ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ( Rahul Gandhi ) చేపట్టిన పాదయాత్ర కారణంగానే పార్టీకి బలం చేకూరిందని ముందు మనం దేశ వ్యాప్తంగా కూడా ఇదే తరహా ఫలితాలు రాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ధీమాతో ఉన్నారు.ప్రస్తుతం ఉన్న బిజెపి ప్రభుత్వం పై వ్యతిరేకత కారణంగానే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయం నిజమే అయినా కూడా మొత్తానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఫలితం కొంతైనా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నదని, అలాగే ముందు ముందు జరగబోతున్న ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు( Chandrababu naidu ) ఆమధ్య వైస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.ఇప్పుడు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి దేశానికి ప్రధాని అవ్వబోతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు.







