ఎమ్ ఓ వాచ్ ఫోన్ 27 స్మార్ట్ వాచ్( IMOO Kids Watch Phone Z7 ) ప్రత్యేకంగా చిన్నారుల కోసం తయారై మార్కెట్ లోకి వచ్చింది.ఈ స్మార్ట్ వాచ్ లో చిన్నారుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.ఫీచర్ లతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.
ఎమ్ ఓ వాచ్ ఫోన్ 27 స్మార్ట్ వాచ్:
ఈ వాచ్ 1.3 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారైన ఈ స్మార్ట్ వాచ్ లో AI ఇంటెలిజెంట్ మోడ్( AI Intelligent Mode ) లాంటి అధునాతన ఫీచర్ పొందుపరిచారు.
చిన్నారుల శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు ( Temperature, heart rate )ట్రాకింగ్ లాంటి హెల్త్ ఫీచర్ లను ఈ వాచ్ లో పొందు పరిచారు.ఫ్యామిలీ చాట్, యాడ్ ఫ్రెండ్స్, ఎమోషన్ రికగ్నిషన్, హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ఆక్సిజన్ లాంటి ఫీచర్ లను ఈ వాచ్ లో పొందు పరచడం జరిగింది.
ఈ స్మార్ట్ వాచ్ లో ఇన్ బిల్డ్ కెమెరా ను అందించారు.5 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో వస్తోంది.740 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.100 గంటల వరకు బ్యాకప్ ఉంటుంది.4GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.4G, వైఫై కనెక్టివిటీ ను అందించారు.ఈ స్మార్ట్ వాచ్ కు IPX8 రేట్ వాటర్ రెసిస్టెంట్ ను అందించారు.ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికి వస్తే రూ.14990 గా ఉంది.ధర కాస్త ఎక్కువగా చిన్నారులకు నచ్చే విధంగా అద్భుతమైన డిజైన్ మైమరిపించే ఫీచర్లతో ఆకట్టుకునే విధంగా ఈ స్మార్ట్ వాచ్ ను తయారు చేశారు.