మునగాకును బ్రేక్ ఫాస్ట్ లో ఈ విధంగా తీసుకుంటే ఓవర్ వెయిట్ కు బై బై చెప్పవచ్చు!

మునగాకు.అద్భుతమైన ఆకుకూరల్లో ఇది ఒకటి.మునగాకులో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా సహాయపడతాయి.ముఖ్యంగా అధిక బ‌రువు సమస్యతో బాధపడుతున్న వారికి మునగాకు ఒక వరం అని చెప్పవచ్చు.

మునగాకును ఇప్పుడు చెప్పబోయే విధంగా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఓవర్ వెయిట్ స‌మ‌స్య‌కు సులభంగా బై బై చెప్పొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం మునగాకును ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా అరకప్పు మునగాకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.అలాగే ఒక యాపిల్ ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

Advertisement

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, క‌డిగి పెట్టుకున్న‌ మునగాకు, నాలుగు నుంచి ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు, అర‌ అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క వేసుకోవాలి.

చివరిగా ఒక గ్లాస్‌ కొబ్బరి పాలు, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన మునగాకు యాపిల్ స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ టైం లో తీసుకోవాలి.వారంలో కనీసం మూడు సార్లు మునగాకును ఈ విధంగా తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా పెరుగుతుంది.

దానితో క్యాలరీలు త్వరగా కరిగి వేగంగా బరువు తగ్గుతారు.

అలాగే మునగాకుతో తయారు చేసిన ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రోగ‌ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

మూత్రాశయంలో రాళ్లు కరుగుతాయి.మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Advertisement

కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారే కాదు ఎవ్వరైనా ఈ మునగాకు ఆపిల్ స్మూతీని డైట్ లో చేర్చుకోవచ్చు.

తాజా వార్తలు