ఈ రోజుల్లో 100 రూపాయలు వెచ్చించినా ఆట బొమ్మలు కూడా రావడం లేదు.అలాంటిది పాతకాలంలో వంద రూపాయలు లోపే చాలా వస్తువులు, వాహనాలు కూడా వచ్చేవి.
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా ఇది నిజం.దీనికి నిదర్శనంగా తాజాగా ఒక పాతకాలంనాటి సైకిల్ బిల్లు నిలుస్తోంది.
సైకిల్ కొనుగోలు చేసిన తర్వాత షాపు ఓనర్ ఇచ్చిన ఈ బిల్లు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.దాదాపు 90 ఏళ్ల క్రితం నాటి ఈ స్లిప్ ఇప్పటికీ ఎలా దాచుకున్నారో తెలియదు కానీ అప్పట్లో ధరలు ఎంత తక్కువ ఉన్నాయో మాత్రం అందరికీ తెలిసిపోయింది.
వైరల్ అవుతున్న బిల్లు గమనిస్తే.కోల్‌కతాలోని ఒక సైకిల్ షాప్‌లో అమ్మిన సైకిల్ ధర 18 రూపాయలు రాసి ఉండటం మీరు చూడవచ్చు.ఈ ధర జనవరి 7, 1934 నాటిదని కూడా గమనించవచ్చు.ఈ ఫొటోను సంజయ్ ఖరే అనే ఫేస్‌బుక్ యూజర్ షేర్ చేశాడు.సంజయ్ ఖరే ఈ పాత బిల్లును పోస్ట్ చేస్తూ.“ఒకప్పుడు సైకిల్ కొనడం అనేది మా తాతగారి డ్రీమ్.సైకిల్ చక్రంలా, కాలచక్రం ఎంత తిరిగింది!” అని పేర్కొన్నాడు.ఈ స్లిప్‌లో షాపు పేరు ‘కుముద్ సైకిల్ వర్క్స్’ అని రాసి ఉండటం మీరు గమనించవచ్చు.అలానే ఈ షాప్ అడ్రస్ షాప్ నంబర్- 85A, మానిక్తల, కలకత్తా అని చాలా చక్కగా రాయడం కూడా మీరు చూడవచ్చు.

ద్రవ్యోల్బణం వల్ల ఇప్పుడు సైకిల్ ధరలు వేలకు చేరుకున్నాయి.చిన్నపిల్లల సైకిల్ కూడా ఈ రోజుల్లో రూ.3-5 వేలు వెచ్చించకపోతే రావడం లేదు.ఈ పాత బిల్లు చూసిన తర్వాత చాలామంది తమ బాల్యపు జ్ఞాపకాల్లో మునిగిపోతున్నారు.తమకు కూడా ఒక సైకిల్ ఉండేదని గుర్తు తెచ్చుకుంటున్నారు.ఈ బిల్లుపై మీరు కూడా ఓ లుక్కేయండి.







