టాలీవుడ్ సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణం రాజు( Krishnam raju ) నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తన పెదనాన్న ని ఏమాత్రం అనుసరించకుండా, తన సొంత నిర్ణయాలతో సినిమాలు చేస్తూ యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ).కృష్ణం రాజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కదా అని ఆయనకి మొదటి సినిమా నుండే విపరీతమైన స్టార్ స్టేటస్ వచ్చేయలేదు.
ఒక్కో మెట్టు ఎదుగుతూ హిట్టు మీద హిట్ కొడుతూ, బాహుబలి సిరీస్ తో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగిపోయాడు ప్రభాస్.బాహుబలి సిరీస్ తర్వాత ఇండియా లో ప్రభాస్ స్టార్ స్టేటస్ ని అందుకునే సూపర్ స్టార్ లేదంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆ చిత్రం తర్వాత ఆయన నుండి రెండు సినిమాలు విడుదలైతే రెండు ఫ్లాప్ అయ్యాయి, కానీ కలెక్షన్స్ మాత్రం మన టాలీవుడ్ స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానం గా వచ్చాయి.

నేడు ఆయన హీరో గా నటించిన ‘ఆదిపురుష్’( Adipurush ) మూవీ గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ కి వెళ్తుంది అనే విషయాన్నీ కాసేపు పక్కన పెడితే ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’( Ishwar ) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ నిర్మాత అశోక్ రాజు ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ నిర్మించాడు కూడా.అప్పట్లో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, ప్రభాస్ నటన కి మంచి మార్కులు పడ్డాయి.
అప్పట్లో ఈ చిత్రాన్ని రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ లోపే తెరకెక్కించారు, విడుదల తర్వాత ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో ఫుల్ రన్ లో నాలుగు కోట రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో ప్రభాస్ కి యూత్ లో అప్పటి నుండే క్రేజ్ పెరగడం మొదలైంది.

ప్రభాస్ మొదటి సినిమాగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం చెయ్యాల్సి ఉంది, కానీ అప్పటికే ఆ కథ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తో లాక్ అయిపోయిందని చెప్పడం తో ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమాతో లాంచ్ అయ్యాడని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.రెండు సినిమాల్లోని పాటలు కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది.అలా ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ నాలుగు కోట్ల రూపాయిలు రేంజ్ లో వసూలు చేస్తే, ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
కేవలం ఆయన పేరు మీద వేల కోట్ల రూపాయిలు బిజినెస్ జరుగుతుంది.కృష్ణం రాజు బ్రతికి ఉన్నన్ని రోజులు ప్రభాస్ ఎదుగుదల ని చూసి ఎంతో మురిసిపొయ్యేవాడు.
రాబొయ్యే రోజుల్లో ఆయన ఇంకా ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి.







