మొక్కజొన్న పంటను( Corn crop ) ఏడాదిలో ఏ కాలంలో అయినా పండించవచ్చు.మొక్కజొన్న పంటకు మార్కెట్లో ఏడాది పొడవునా ఎప్పుడూ మంచి డిమాండే ఉంటుంది.
నీటి వసతి ఉంటే ఏ కాలంలోనైన మొక్కజొన్నను సాగు( Corn Crop Cultivation ) చేసి అధిక దిగుబడి పొందవచ్చు.మొక్కజొన్న పంటను ఖరీఫ్ లో కాకుండా రబీలో సాగు చేస్తే.
పెట్టుబడి వ్యయం తగ్గి దిగుబడి ఎక్కువగా ఉంటుంది.ఖరీఫ్ లో ఏదైనా పంట సాగు చేసి రెండవ పంటగా మొక్కజొన్నను సాగు చేసేందుకు రైతులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
జీరో టిల్లెట్ పద్ధతి( Zero tillet method ) ద్వారా పొలం దున్నకుండా, పంట విత్తుకుని సాగు చేస్తే దాదాపుగా పెట్టుబడి భారం తగ్గుతుంది.ఈ పద్ధతిలో తక్కువ కూలీలు అవసరం అవుతారు.
సాధారణంగా రైతులు( Farmers ) రెండవ పంట వేయడానికి ముందు నేలను దుక్కి దున్ని, ఆ తర్వాత నేలను మెత్తగా దున్ని పంట విత్తుకుంటారు.ఇలా చేస్తే పెట్టుబడి భారం పెరగడంతో పాటు సమయం వృధా అవుతుంది.కొన్ని సందర్భాల్లో పంట సాగు చేయలేని పరిస్థితులు కూడా ఏర్పడతాయి.
ఈ క్రమంలో జీరో టిల్లెట్ వ్యవసాయం( Agriculture ) వైపే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.రబీ కాలంలో వరి పంటకు సరిపడే నీరు అందుబాటులో లేకపోతే అలాంటి వరి పొలాల్లో మొక్కజొన్న సాగు చేస్తే చీడపీడల సమస్య చాలా తక్కువగా ఉంటుంది.ఒక ఎకరాకు 8 కిలోల విత్తనాలను ఎంపిక చేసుకొని, పొలంలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
ఒక ఎకరం పొలంలో 80 కిలోల నత్రజని, 30 కిలోల పొటాష్, 30 కిలోల భాస్వరం ఎరువులను వేసుకోవాలి.ఇక నేలలోని తేమశాతాన్ని బట్టి వారం లేదా పది రోజులకుఒకసారి నీటి తడులను అందిస్తూ ఉండాలి.
ఇలా సాగు చేస్తే పెట్టుబడి చాలా వరకు తగ్గడంతోపాటు దిగుబడి చాలా వరకు పెరుగుతుంది.