Women healthy juice : మహిళలు వారంలో 2 సార్లు అయినా ఈ జ్యూస్ ను తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదు!

సాధారణంగా ప్రతి మహిళా తన జీవిత కాలంలో ఎన్నో సమస్యలను మరియు సవాళ్లను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

ఆ సమస్యలను, సవాళ్లను ఎదిరించి గట్టిగా నిలబడాలంటే ఖ‌చ్చితంగా డైట్ లో కొన్ని కొన్ని ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సూపర్ హెల్తీ అండ్ టేస్టీ జ్యూస్ ను వారంలో రెండు సార్లు అయినా తీసుకుంటే మహిళల ఆరోగ్యానికి తిరుగుండ‌దు.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా నైట్ నిద్రించే ముందు ఐదు బాదం పప్పులను నీటిలో నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఒక మీడియం సైజు బీట్ రూట్ తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అరకప్పు కొబ్బరి ముక్కలను కట్ చేసుకుని పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, కొబ్బరి ముక్కలు, నైట్ అంతా నానబెట్టి పొట్టు తొల‌గించిన బాదం పప్పులు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

If Women Take This Juice Twice A Week It Is Very Good For Health Women, Juice,
Advertisement
If Women Take This Juice Twice A Week It Is Very Good For Health! Women, Juice,

ఈ కొబ్బరి బీట్ రూట్ జ్యూస్ టేస్ట్ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.మహిళలు వారంలో కనీసం రెండు సార్లు అయినా ఈ జ్యూస్ ను తాగితే అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు. రక్తహీనత సమస్య ఉంటే దూరం అవుతుంది.

వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటారు.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

చర్మం ఎల్లప్పుడూ నిగారింపుగా మెరుస్తుంది.అంతేకాదు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మార‌తాయి.

డయాబెటిస్, ఆల్జీమర్స్ వంటి వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు రక్తపోటు స్థాయిలు సైతం అదుపులో ఉంటాయి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు