టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నిన్న తెల్లవారుజామున అనారోగ్య సమస్య కారణంతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది సినీ ప్రముఖులు హుటాహుటిన కృష్ణ గారి పార్తివదేహాన్ని చూడటం కోసం తరలివస్తున్నారు.
ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్నే అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోకి తరలించారు.మరి కాసేపట్లో కృష్ణ అంతిమయాత్ర పద్మాలయ స్టూడియో నుంచి మొదలవుతుంది.
ఇప్పటికే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సైతం తన తాతయ్య చివరి చూపు కోసం విదేశాల నుంచి వచ్చారు.
ఈ విధంగా కృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో కన్నీటి పర్యంతరం అవుతున్నారు.
ఇకపోతే కృష్ణ గారి కుమార్తె మంజుల సోషల్ మీడియా వేదికగా తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాన్న మీరు ఈ ప్రపంచానికి సూపర్ స్టార్ మా కోసం మీరు చూపించిన ప్రేమ ఎల్లప్పడికి మాతోనే ఉంటుంది.ఏది ఏమైనా మీరే మా జీవితాలకు సూపర్ స్టార్ ఈ కళామతల్లికి మీరు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి ఐ మిస్ యు నాన్న లవ్ యు సో మచ్ అంటూ కృష్ణ గురించి మంజుల ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం మంజుల చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారి ఆఖరి చూపు కోసం ఎంతోమంది అభిమానులు తరలివస్తున్నారు.మరి కాసేపట్లో ఈయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది.ఈయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాల నడుమ జరగనున్నాయి.ఇక సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి చూపు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయి ఆయనకు నివాళులు అర్పించారు.