ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎన్నో ఫీచర్లతో వస్తుంది.స్మార్ట్‌ఫోన్ ఉన్న దాదాపు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు.అయితే దీనిని ఉపయోగించడం వల్ల ఒక సమస్య ఎదురవుతుంది.అదేంటంటే, అన్ని ఇతర యాప్స్ లాగానే ఈ యాప్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం రన్ అవుతుంది.దీనివల్ల చాలా డేటా అనవసరంగా ఖర్చు అయిపోతుంది.అలాగే ఛార్జింగ్ కూడా తగ్గిపోతుంది.
అయితే ఈ సమస్యకు సింపుల్ స్టెప్స్ తో చెక్ పెట్టచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్ రన్నింగ్‌కి ఇలా చెక్
స్టెప్ 1: యూజర్లు మొదటగా తమ ఫోన్‌లోని సెట్టింగ్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
స్టెప్ 2: అప్పుడు కనెక్షన్స్ లేదా కనెక్షన్ షేరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై నొక్కాలి.
స్టెప్ 3: అనంతరం ‘డేటా యూసేజ్ (Data Usage)’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 4: అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్స్ మీకు కనిపిస్తాయి.ఈ లిస్ట్‌లో మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ డిస్‌ప్లే అవుతాయి.
ఆ లిస్టును వాట్సాప్ కనిపించే వరకు కిందకి లేదా పైకి స్క్రోల్ చేయాలి.వాట్సాప్ కనిపించగానే దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 5: ఆపై ‘అలో బ్యాక్‌గ్రౌండ్ డేటా యూసేజ్ టోగుల్ ఆఫ్ చేస్తే వాట్సప్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో మొబైల్ డేటా వినియోగించదు.వాట్సాప్ తక్కువగా వినియోగించే వారు దానిని ఫోర్స్ స్టాప్ చేస్తే బ్యాటరీ కూడా సేవ్ చేసుకోవచ్చు.