సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కొంతమంది హీరోలతో చేస్తే సూపర్ డూపర్ సక్సెస్ లు అవుతాయి.ఇక కొన్ని కారణాలవల్ల ఆ హీరోలు ఓకే చెప్పకపోవడం వల్ల వేరే హీరోలతో చేస్తారు అయిన కూడా ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి.
అయినప్పటికీ స్టార్ హీరోలతో చేసి ఉంటే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేవి అని ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అనిపిస్తూ ఉంటుంది.అయితే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆ హీరోతో ఈ సినిమా పడితే బాగుండేది అని అనిపించిన సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భాష
రజనీకాంత్ ( Rajinikanth )హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన భాష( Basha ) సినిమాను తెలుగులో డబ్ చేశారు.ఇక ఈ సినిమా తమిళం లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.కానీ ఇక్కడ మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.ఇదే సినిమాని తెలుగులో చిరంజీవి( Chiranjeevi ) తో కనక రీమేక్ చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టేదని చాలామంది అభిప్రాయపడ్డారు.
విక్రమార్కుడు
రవితేజ( Ravi Teja ) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు( Vikramarkudu ) సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది.అలాగే రవితేజ ను స్టార్ స్టేటస్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి మొదట ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకున్నాడు.కానీ అనివార్య కారణాలవల్ల అది కుదరలేదు.నిజానికి ఈ సినిమా కనక పవన్ కళ్యాణ్ తో తీసి ఉంటే పక్కాగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఎందుకంటే ఈ సినిమా వేరే భాషలో రీమేక్ చేస్తే అన్ని భాషల్లో ఇండస్ట్రీ హిట్టు కొట్టింది.
ఇక తెలుగులో మాత్రమే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది…
.