ఇంట్లో డ్రైనేజీ వ్యవస్థ ఈ విధంగా ఉంటే ధన లాభం.. లేదంటే నష్టాల పాలవ్వడం ఖాయం..!

చాలామంది ఇల్లు కట్టుకోవడానికి వాస్తు నియమాలను అనుసరిస్తూ ఉంటారు.

ఎలాగైతే మనం ఇల్లు కట్టుకోవడానికి వాస్తు నియమాలను అనుసరిస్తామో, అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి.

అంతేకాకుండా ఇంటి డ్రైనేజీ వ్యవస్థ( Home drainage system ) కూడా ఖచ్చితంగా వాస్తు నియమాలను అనుసరించి ఉండాలి.అలా లేకపోతే ఆ ఇంట్లో ఆర్థిక నష్టాలు కలుగుతాయి.

కుటుంబం అనేక ఇబ్బందులలో పడాల్సి వస్తుంది.మన ఇంట్లో ఉపయోగించినటువంటి నీళ్లు పారుదల వ్యవస్థ పక్కాగా వాస్తు ప్రకారం ఉండాలి.

ఎందుకంటే ఇంట్లో నీటిపారుదల వ్యవస్థ సరిగా లేకపోతే నీళ్లు పారినట్టే డబ్బులు కూడా అనవసరంగా వృధా అయిపోతాయి అని నమ్ముతారు.

Advertisement

కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు రోజుకి దిగజారి పోతాయి.అందుకే ఇల్లు నిర్మించుకునే వాళ్ళు డ్రైనేజీ వ్యవస్థ పైన కూడా పూర్తి అవగాహనతో నిర్మించుకోవాలి.అయితే ఇంట్లో ఏ విధంగా డ్రైనేజీ వ్యవస్థ ఉంటే ఆర్థికంగా బలంగా ఉంటాము.

నీటిపారుదల వ్యవస్థ( Irrigation system ) ఏ వైపున ప్రవహిస్తే నష్టం జరుగుతుంది, అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.వాస్తు ప్రకారం తూర్పు పల్లంగా, పడమర ఎత్తుగా ఉండాలి.

అలాగే దక్షిణం ఎత్తుగా, ఉత్తరం పల్లంగా ఉండాలి.నీరు కూడా పల్లానికి ప్రవహిస్తూ ఉండాలి.

ఇంట్లో డ్రైనేజీ వ్యవస్థ తూర్పున ఉత్తరం వైపు ప్రవహిస్తే మంచిది.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, ఆదివారం 2024

అలాగే నీటిపారుదల తూర్పు వైపున ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ( Goddess Lakshmi )నివసిస్తుంది.అలాగే కుటుంబ సభ్యుల పురోగతి బాగుంటుంది.అంతేకాకుండా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడానికి, అవరోధాలను అధిగమించడానికి తూర్పున నీటిపారుదల వ్యవస్థ దోహదం చేస్తుంది.

Advertisement

ఇక ఉత్తర దిశలో నీరు ప్రవహించినప్పుడు ఆ ఇంటికి శుభం జరుగుతుంది.అలాగే కుటుంబ ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది.ఇంటికి పశ్చిమ దిశలో నీటిపారుదల వ్యవస్థ పొరపాటున కూడా అస్సలు ఉండకూడదు.

డ్రైనేజీ వ్యవస్థ పశ్చిమానికి ప్రవహించకూడదు.ఇలా జరిగితే కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది.

అలాగే డబ్బును, జ్ఞానాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

తాజా వార్తలు