డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించిన దర్శకులలో ఒకరు.భిన్నమైన కథలతో సినిమాలను తెరకెక్కించడం, డైలాగ్స్ రియాలిటీకి దగ్గరగా ఉంటూనే యూత్ ను ఆకట్టుకునేలా ఉండటం, ఊహించని కథ, కథనాలతో సినిమాలను తెరకెక్కించడం పూరీ జగన్నాథ్ సక్సెస్ కు కారణమని చాలామంది భావిస్తారు.
పూరీ జగన్నాథ్ సినిమాలు ఫ్లాపై ఉండొచ్చు కానీ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదని చాలామంది భావిస్తారు.అయితే కొన్ని సినిమాలకు పూరీ జగన్నాథ్ నిర్మాతగా కూడా వ్యవహరించడంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.
పూరీ మ్యూజింగ్స్ ద్వారా భిన్నమైన అంశాల గురించి స్పందించడంతో పాటు తన విషయాల ద్వారా ఎంతో ఆకట్టుకుంటున్న పురీ జగన్నాథ్ తాజాగా ప్రేమ గురించి ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు.

చాలామంది అవతలి వ్యక్తి నా ఆస్తి అనే విధంగా ప్రవర్తిస్తారని అలా ప్రవర్తించడానికి ముఖ్య కారణం ప్రేమ అని పూరీ జగన్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రేమ పేరుతో కట్టేయడం వల్ల అవతలి వ్యక్తికి ఊపిరాడదని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.ఇలాగే కొనసాగితే ప్రేమ వేధింపు అవుతుందని అన్ని సీక్రెట్లను మనతోనే పంచుకోవాలనే భావన కలుగుతుందని పూరీ జగన్నాథ్ అన్నారు.
మీ లవ్ అలాంటి లవ్ అయితే దయచేసి ప్రేమించొద్దని పూరీ జగన్నాథ్ తెలిపారు.ప్రేమ అవతలి వ్యక్తికి ఊపిరాడకుండా చేయకూడదని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.ఇతరుల మీద మన అధికారం చూపకూడదని మనం ఇక్కడికి టూరిస్ట్ లా వచ్చామని టూరిస్ట్ లానే ఉండాలని ఆయన కామెంట్లు చేశారు.పూరీ చెప్పిన విషయాలు కూడా నిజమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







