నేతలు కళ్లు మూసుకున్నా.సోషల్ మీడియా గొంతు విప్పుతోంది.“సార్ మీరు ఏం చెప్పారు.ఇప్పుడు ఏం చేస్తున్నారు?“ అని రాజకీయ పార్టీలపైనా.నేతలపైనా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.నాయకులు ఎవరైనా.సోషల్ మీడియాకు ఒక్కటే.పార్టీలుఏవైనా.
సోషల్ ట్రెండ్ కూడా ఒక్కటే.అందుకే .సోషల్ గళానికి పదును పెరుగుతోంది.నాయకులకు దడ పుడుతోందని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా .జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు.సార్ మీరు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇందుకేనా మేం మీకు ఓట్లేయాలి? అని నిలదీస్తున్నారు.
ఇది వాస్తవం.
కళ్లూముసుకుని నాయకులు ఉన్నా.సోషల్ మీడియాలో స్పందిస్తున్న గళాలను మాత్రం ఎవరూ ఆపలేక పోతున్నారు.
ప్రశ్నిస్తాను.అన్యాయంపై పోరాటం చేస్తాను! అంటూ.
రాజకీయాల్లోకి వచ్చిన పవన్.ఇప్పటి వరకు ఎవరినీ ప్రశ్నించలేక పోయారు.
అయితే.తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని.
బీజేపీ నాయకులే.గుసగుసలాడుతున్నారు.“ఇలా అయితే.ఏం చెప్పాలి.
ప్రజల్లోకి ఎలా వెళ్లాలి!“ అని సీమకు చెందిన ఓ యువ నాయకుడు.గుసగుసలాడిన ఆడియో హల్ చల్ చేస్తోంది.

మరి ఇంతగా .బీజేపీ నేతలే దుమ్మెత్తి పోస్తున్న కేంద్ర బడ్జెట్‌పై ఏపీపై మమకారం.ఇక్కడి సమస్యలపై విశాల దృష్టి.పోరాటం చేసేందుకు పాకులాట వంటి అనేక లక్ష్యాలు పెట్టుకున్న పవన్ ఏం చేస్తున్నారు? ప‌్రశ్నిస్తున్నారా? కనీసం.బడ్జెట్లో ఏపీకి నిధులు లేవు.హోదా మాట పక్కన పెడితే.
పోలవరం ఊసు లేదు.రైల్వే జోన్ మాట కనిపించలేదు.
పోనీ.వెనుకబడిన సీమ(బీజేపీ నేతలు చెబుతున్నదే)కు నిధులు నీళ్లు కూడా లేవు.
ఇక, విశాఖలో పరిశ్రమల ఊసు ఎక్కడా కనిపించలేదు.
పైగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు ధారాదత్తం చేసే చర్యలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై పెదవి కూడా విప్పని.పవన్‌ను ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా జనాలు.నిజమేకదా! బాధ్యత ఉన్న నాయకుడు, భవిష్యత్తు ఉందని భావిస్తున్న నాయకుడుగా పవన్ నోరు విప్పక పోవడం.నిజాలను సైతం ఒప్పుకోలేక పోవడం.ఎక్కడో తేడా కొడుతోందన్న సంకేతాలకు దారితీస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.ఇలానే ఉంటే.
ప్రజలు పిచ్చోళ్లు కారు.ఎక్కడ ఎప్పుడు ఎలా ఆన్సర్ చెప్పాలో వారికి బాగా తెలుసు!! అంటున్నారు నెటిజన్లు.