షర్మిల ఆంధ్ర పాలిటిక్స్ లోకి అడుగుపెడితే వైసీపీ షెడ్డుకి పోక తప్పదా..?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై ఎస్ షర్మిల జగన్ కి సెపెరేట్ గా జరిగి తెలంగాణ లో వైఎస్ఆర్ టీపీ పార్టీ ని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే.పరోక్షంగా ఈమె జగన్ మీద ఇప్పటి వరకు ఎన్నో విమర్శలు చేసింది కూడా.

 If Sharmila Enters Andhra Politics, She Must Go To The Ycp Shed , Ys Sharmil-TeluguStop.com

అంతే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చెయ్యడానికి ఆమె చాలా కృషి చేసింది.మధ్యలో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకోవాలని చూసింది, కానీ చర్చలు విఫలం అయ్యాయో ఏమో తెలియదు కానీ, మళ్ళీ వెనక్కి తగ్గి 119 స్థానాల్లో పోటీ చేస్తున్నాం అని అధికారిక ప్రకటన చేసింది.

కానీ చివరి నిమిషం లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ( Congress party ) తో చర్చలు జరిపి ఈ ఎన్నికల నుండి తప్పుకుంటున్నాను అని అధికారిక ప్రకటన చేసింది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలిస్తే చారిత్రిక తప్పిదం చేసిన దానిని అవుతాను అంటూ చెప్పుకొచ్చింది.

Telugu Cm Jagan, Congress, Tdp Janasena, Ys Sharmila-Movie

దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తో షర్మిల మరోసారి చర్చలు జరిపిందని, రాబొయ్యే ఎన్నికలలో షర్మిల ని కాంగ్రెస్ పార్టీ కి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం చీఫ్ చేస్తామని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో నీ చేతిలోనే పెడుతాం అంటూ షర్మిల కి భరోసా ఇచ్చారట.అందుకే ఆమె ఎన్నికల పోటీ నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎటువంటి స్థానం లో ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అంత బలమైన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆనవాళ్లు కూడా మిగలకుండా కాలగర్భం లో కలిసిపోయింది.ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ కి ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా చెయ్యాలని చూస్తుంది అధిష్టానం.

Telugu Cm Jagan, Congress, Tdp Janasena, Ys Sharmila-Movie

అందులో భాగంగానే షర్మిల కి ఆ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారట.అంటే షర్మిల పార్టీ ( Sharmila party )ఇక కాంగ్రెస్ లో విలీనం అయ్యిపోయినట్టే అనుకోవచ్చు.ఒకవేళ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి, కృషి పట్టుదల తో కష్టపడి జనాల్లోకి వెళ్తే వైసీపీ పార్టీ కి మామూలు నష్టం కలగదని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.కచ్చితంగా ఆమె వైసీపీ ఓట్ బ్యాంక్ ని ఒక రేంజ్ లో చీలుస్తుందని, టీడీపీ – జనసేన( TDP Janasena ) కంటే ఇప్పుడు షర్మిల వైసీపీ కి చాలా డేంజర్ గా మారిందని అంటున్నారు.

మరి రాబొయ్యే రోజుల్లో షర్మిల ఎంట్రీ వల్ల ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube