పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే.. బి‌ఆర్‌ఎస్ కు పెద్ద దెబ్బే !

తెలంగాణ రాజకీయాల్లో ఈ మద్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ప్రతిరోజూ హాట్ టాపిక్ గానే నిలుస్తోంది.బి‌ఆర్‌ఎస్ బహిష్కృత నేతగా పొంగులేటి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

 If Ponguleti Joins The Congress.. It Will Be A Loss For Brs,  Ponguleti Srinivas-TeluguStop.com

ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించే సామర్థ్యం పొంగులేటిలో ఉండడంతో ఆయనను ఆకర్శించేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటిగా ప్రయత్నించాయి.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కే‌సి‌ఆర్( CM KCR ) ను ఒక్కసీటు కూడా గెలవనివ్వనని శపథం చేసిన పొంగులేటి.

తన లక్ష్యం దిశగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చారు.ఒకానొక టైమ్ లో సొంత పార్టీ పెట్టి ఖమ్మం జిల్లాలోని అన్నీ స్థానాలను కైవసం చేసుకొని క్రియాశీలకంగా వ్యవహరించే ప్లాన్ కూడా చేశారు.

Telugu Cm Kcr, Congress, Khammam, Telangana-Politics

కానీ అవేవీ కాదని ఇప్పుడు కాంగ్రెస్ వైపే ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.ఈ నెల 25న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఆయన అధికారికంగా హస్తం పార్టీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది.అయితే బీజేపీలో చేర్చుకునేందుకు పొంగులేటితో కమలనాథులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన కాంగ్రెస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.అయితే పొంగులేటి( Ponguleti Srinivasa Reddy ) కాంగ్రెస్ వైపు చూడడానికి కారణం ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ కే ఎక్కువ బలం ఉంది.

Telugu Cm Kcr, Congress, Khammam, Telangana-Politics

కాబట్టి తాను శపథం చేసినట్లుగా బి‌ఆర్‌ఎస్( BRS party ) కు ఒక్కసీటు కూడా దక్కకుండా చేయాలంటే కాంగ్రెస్ తో కలిస్తేనే సాధ్యమతుందనే ప్లాన్ లో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు బి‌ఆర్‌ఎస్ కూడా ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని గట్టి పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో తాను ప్రత్యేక పార్టీ పెట్టినా, బీజేపీతో కలిసిన.

బి‌ఆర్‌ఎస్ కే లాభం చేకూరుతుందని భావించి వ్యూహతంకంగా కాంగ్రెస్ వైపు అడుగులేసినట్లు తెలుస్తోంది పొంగులేటి.ఇక ఆయన కాంగ్రెస్ లో చేరడం వల్ల బి‌ఆర్‌ఎస్ వ్యతిరేక ఓటు మరియు పొంగులేటి సానుకల ఓటు బ్యాంకు మరియు కాంగ్రెస్ మద్దతుదారుల ఓటు బ్యాంకు అన్నీ కలిసి బి‌ఆర్‌ఎస్ ను గట్టిగా దెబ్బతీసే అవకాశం ఉంది.

ఏది ఏమైనప్పటికి పొంగులేటి శపథం చేసినట్లుగా తన లక్ష్యం వైపే అడుగులేస్తున్నారనే చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube