లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే ఇలా ఉండాల్సిందేనట!

లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే ఇలా ఉండటం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఇంట్లో ప్రతి నిత్యం ఇలా ఉంటే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదంటున్నారు.

సంపాదించిన డబ్బు మన ఇంట్లోనే నిలవడంతో పాటు సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. లక్ష్మీ దేవి మన ఇంట్లో నిలిచేందుకు చేయాల్సిన పనులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో శుభ్రత పాటించే వారి ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుందట.ఆహారం వృథా చేయకుండా ఉంటేనే… ఆ ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుందట.

రోజూ ఆహారాన్ని పడేస్తుంటే లక్ష్మీ దేవి బయటకు వెళ్లిపోతుందట.శుభ్రత, శాంతి లేని కుటుంబాల్లోకి లక్ష్మీదేవి అస్సలే అడుగు పెట్టదట.

Advertisement

అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా గొడవలు లేకుండా ప్రేమ, ఆప్యాయలతో మెలిగే ఇళ్లలోకి లక్ష్మీ దేవి వచ్చేందుకు ఇష్టపడుతుందట.అందుకే ఇంట్లో ఉన్న వారందరూ పరస్పరం ప్రేమ, ఆప్యాయలతో మెలగాలి.

జ్ఞానులు, సాధువులు, మహాత్ముల ఇళ్లలో డబ్బులకు కొదవ ఉండదట.వారు చేసే మంచి పనుల వల్ల కీర్తి, సంపదలు పొందుతారట.

అంతే కాదండోయ్ చెడు మాటలు మాట్లాడే వారి ఇంట్లో కూడా లక్ష్మీ దేవి నిలవదట.వ్యాపార వేత్తలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి మాటలు మాట్లాడడానికే ప్రయత్నించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

లేకపోతే మీరు సంపాదించిన డబ్బును కోల్పోవాల్సి ఉంటుందట.అందుకే అబద్ధాలు చెప్పకుండా, నీతి నిజాయితీ తో మెలుగుతూ.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
కలర్ ను పెంచే ఖర్జూరం.. వారానికి 2 సార్లు ఇలా వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!

అందరినీ ప్రేమగా చూడాలి.గౌరవంతో మాట్లాడాలి.

Advertisement

అప్పుడే లక్ష్మీ దేవి కటాక్షం మనపై ఉంటుంది.

తాజా వార్తలు