వెంకటేష్ ఫ్యామిలీ హీరో గా ఎన్నో సినిమా లు చేసిన విషయం తెలిసిందే.ఆయన సినిమా లు నిరాశ పరిచిన కూడా ఆ సినిమా లోని పాత్రలతో మెప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు కానీ ఆయన పాత్రలు ఎప్పుడు కూడా ఫ్లాప్ అవ్వలేదు.కానీ ఇటీవల ఆయన చేసిన రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్ పై స్వయంగా ఆయన అభిమానులు విమర్శలు చేస్తున్నారు.
ఇన్నాళ్ల సినీ కెరియర్ లో ఇలాంటి పాత్ర ను వెంకటేష్(Venkatesh) ఎప్పుడు కూడా చేయలేదు.కనుక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆయనను ఇన్నాళ్లు అభిమానిస్తున్నారు.
కానీ రానా నాయుడు సినిమా తో ఆ మంచి పేరు ను వెంకటేష్ పోగొట్టుకున్నరు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోలు వెబ్ సిరీస్ చేయాలని ఆశపడుతున్న విషయం తెల్సిందే.
ఆ హీరోలకు ఈ సిరీస్ ఒక గుణపాఠం అవ్వాలి.ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని ప్రచారం జరిగింది.చిరంజీవి(Megastar Chiranjeevi) వెబ్ సిరీస్ చేస్తే బాగానే ఉంటుంది,

కానీ రెగ్యులర్ వెబ్ సిరీస్ మాదిరిగా కాకుండా.అంటే వెంకటేష్ చేసిన రానా నాయుడు వంటి బూతు సిరీస్ కాకుండా మంచి ఫ్యామిలీ విలువ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూర్చుని చూసే విధంగా ఉంటే సూపర్ హిట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.మెగాస్టార్ చిరంజీవి కూడా బూతుల సిరీస్ చేస్తే మాత్రం ఇన్నాళ్ల సినీ కెరియర్ లో దక్కించుకున్న గుర్తింపు స్టార్డం అంతా బూడిదల పోసిన పన్నీరు అవుతుందంటూ స్వయంగా అభిమానులు ఆయన్ని హెచ్చరిస్తున్నారు.అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం అసలు చిరంజీవి వెబ్ సిరీస్ చేయాలనే ఆసక్తిని కలిగి లేరు అంటూ ప్రచారం జరుగుతుంది.
చిరంజీవి మాత్రమే కాకుండా ఏ ఇతర హీరోలు చేసినా కూడా కాస్త ఆచితూచి సిరీస్ ను ఎంపిక చేసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







