తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది.. సీఎం కేసీఆర్

టాలీవుడ్ చరిత్రలో మరుపురాని క్షణం.భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే రోజు.

 Telangana Culture Mirrored.. Cm Kcr-TeluguStop.com

భారతీయ సినిమాకు ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిన ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ చిత్రం సాధించింది.‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందన్నారు.ఆస్కార్ గెలుచుకోవడం తెలుగు వారిగా గర్వకారణమని కొనియాడారు.

నాటు నాటు పాట తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిందని చెప్పారు.అంతేకాకుండా ఈ పాట తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనమన్నారు.

ఈ క్రమంలో రాజమౌళి బృందానికి తన అభినందనలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube