ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్.2024 ఎన్నికలు.ఎన్నికలకు ఇంత ముందు నుంచే రాజకీయ పార్టీలు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.ఎలాగైనా సరే అధికార వైసీపీని గద్దె దించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.
చాలా పార్టీల నాయకులు పొత్తుల గురించి ప్రకటనలు చేశారు.ఎలాగైనా సరే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి అధికార వైసీపీని గద్దె దించాలని పిలుపునిచ్చాయి.
కానీ ఈ విపక్షాల కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనే విషయంలో అనేక మందికి అనేక డౌట్లు ఉన్నాయి.
మొదట జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ దీని గురించి మాట్లాడుతూ.
అరాచకాలు చేస్తున్న వైసీపీ అధికారాన్ని తొలగించడం కోసం రాష్ట్రంలో ఉన్న విపక్షపార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను జనసేన తీసుకుంటుందని ఆయన తెలిపారు.అవసరమైతే ఇందుకోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు.
కానీ పొత్తుల గురించి పార్టీల కూటమి గురించి మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఇలా పవన్ చేసిన వ్యాఖ్యలపై చాలా రోజులే డిబేట్ నడిచింది.
చాలా మంది చాలా రకాల విశ్లేషణలు చేశారు.ఇక ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా టూర్ లో ఉన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.అరాచకాలను పాల్పడుతున్న వైసీపీని అధికారం నుంచి తొలగించడం కోసం టీడీపీ రాష్ట్రంలోని అన్ని విపక్షల పార్టీలను కూడగడుతుందని తెలిపారు.
ఆ కూటమికి టీడీపీ పెద్దన్నలా వ్యవహరిస్తుందన్నారు.

ఇప్పుడు బాబు చేసిన వ్యాఖ్యలతో ఒకటి స్పష్టంగా తేటతెల్లమైంది.కూటమి అంటూ ఏర్పడితే దానికి టీడీపీ యే నాయకత్వం వహిస్తుందని ఆయన తెలిపారు.మరి పవన్ ఆ రోజు చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మరి పవన్ కల్యాణ్ సీఎం అవుతాడని ఆయన అభిమానులు పెట్టుకున్న ఆశల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.ఒక వేళ జనసేన కూటమిలో చేరితే పవన్ సీఎం అవడం జరిగే పని కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.