అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో( Under-19 Cricket World Cup ) భారత జట్టు నేడు సౌత్ ఆఫ్రికా తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది.భారత జట్టు( Team India ) లీగ్ దశలో ఓటమి ఎరుగకుండా సూపర్ సిక్స్ కు వెళ్ళింది.
సూపర్ సిక్స్ లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్లలోను గెలిచి సెమీఫైనల్ చేరింది.ఇప్పటికే భారత జట్టు ఐదు సార్లు అండర్-19 టైటిల్ ను ముద్దాడింది.
ఇక ఆరోసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి అదే స్థాయిలో రాణిస్తూ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతోంది.

భారత యువజట్టులో యువ బ్యాటర్ ముషీర్ ఖాన్( Musheer Khan ) తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఇరగదీస్తూ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు అద్భుతమైన సెంచరీలతో మొత్తం 334 పరుగులతో రాణించాడు.కెప్టెన్ ఉదయ్ సహరన్( Captain Uday Saharan ) మొత్తం 304 పరుగులతో రాణించాడు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే.సౌమి కుమార్ 2.17 ఎకనామితో 16 వికెట్లు తీశాడు.మూడుసార్లు ఏకంగా నాలుగు కు పైగా వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు.

ఇక భారత జట్టులో ఉండే నమన్ తివారి 9, రాజ్ లింబని 4 వికెట్లు తీసుకున్నారు.అయితే నేడు జరిగే సెమీఫైనల్ మ్యాచ్ భారత్ కు ఒక కఠిన పరీక్ష.ఆతిధ్య హోదాలో సౌత్ ఆఫ్రికా ( South Africa ) జట్టు సెమిస్ లో చెలరేగే అవకాశం ఉంది.భారత జట్టు ఆటగాళ్లంతా జాగ్రత్తగా ఆడుతూ ఎలాంటి పొరపాట్లు చేయకుండా రాణిస్తే భారత్ ఫైనల్ చేరడం ఖాయం.
భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెమి ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతుంది.







