ప్రతి మనిషి లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో చిన్నచిన్న సమస్యలు వస్తూ ఉంటాయి.ఆ సమస్యలను అధిగమించి ముందడుగులు వేస్తే మాత్రమే కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్( Success ) సొంతమవుతుందని చెప్పవచ్చు.
అయితే ఒక యువతికి మాత్రం కటిక పేదరికానికి అరుదైన వ్యాధి తోడైంది.అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఐఏఎస్( IAS ) కావాలనే లక్ష్యాన్ని మాత్రం ఆ యువతి మరిచిపోలేదు.
కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ సత్తా చాటిన ఆ యువతి పేరు ఉమ్ముల్ ఖేర్( Ummul Kher ) కాగా రాజస్థాన్ రాష్ట్రానికి( Rajasthan ) చెందిన ఈ యువతి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.నిజాముద్దీన్ లోని మురికివాడలో చదువుకున్న ఉమ్ముల్ ఖేర్ బాల్యం నుంచి ఎముకలకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
నయం కాని వ్యాధి వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉమ్ముల్ ఖేర్ మాత్రం కష్టపడి చదువుకున్నారు.
అయితే ఆమెకు ఉన్న అరుదైన వ్యాధి వల్ల ఆమె ఎనిమిది సర్జరీలను( Eight Surgeries ) చేయించుకోవాల్సి వచ్చింది.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఐఏఎస్ కావాలని భావించి ఆమె తన లక్ష్యాన్ని సాధించారు.ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఉమ్ముల్ ఖేర్ మాత్రం కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి ఐఏఎస్ గా నిలిచి ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు.
భవిష్యత్తులో ఆమెకు మరింత మంచి పేరు రావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సివిల్స్ లో( Civils ) 420వ ర్యాంక్ సాధించిన ఉమ్ముల్ ఖేర్ ఈ జనరేషన్ లో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.అన్ని అవయవాలు సరిగ్గా ఉండి ఆర్థికంగా సమస్యలు లేకపోయినా చాలామంది లక్ష్యాన్ని సాధించలేక ఫెయిల్ అవుతుంటే ఉమ్ముల్ ఖేర్ మాత్రం వాళ్లకు భిన్నంగా కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.ఉమ్ముల్ ఖేర్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.