సాధారణంగా కనిపించే ఈ బాతు గుడ్లలో ఏం కనిపించాయో తెలిస్తే షాక్ అవుతారు..!

ప్రపంచంలోని చాలా మంది కోడిగుడ్లను బాగా తినేస్తుంటారు.కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రజల కోడి గుడ్ల తో పాటు బాతు, పిట్ట, టర్కీ గుడ్లు కూడా ఇష్టంగా ఆరగిస్తుంటారు.

 I Would Be Shocked To Know What Is Found In These Commonly Found Duck Eggs, Eg-TeluguStop.com

చికెన్, ఎగ్స్ తర్వాత ప్రజలు ఎక్కువగా తినేది బాతు గుడ్లే.బాతు గుడ్లలో కూడా పచ్చసొన, తెల్లసొన, పెంకు ఉంటాయి.

ఇందులో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.అందుకే వీటిని ఉడకపెట్టి ప్రతిరోజు తింటుంటారు.

అయితే ఏ రకం బాతుగుడ్డు అయినా సరే వాటిలో సొన తెలుపు, పసుపు వర్ణం లోనే ఉంటాయి. కానీ తొలిసారిగా 2 బాతు గుడ్లలో మాత్రం నల్ల సొన కనిపించింది.

దాంతో అందరూ షాక్ అవుతున్నారు.ఇదేంటి పచ్చగా ఉండాల్సిన సొన నలుపు రంగులో ఉందేంటి అని నోరెళ్లబెడుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియో గత కొద్ది రోజులుగా యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

మరి ఇది ఎక్కడ జరిగింది? అసలు ఎన్నడూ లేని విధంగా గుడ్డులోని సొన నల్ల వర్ణంలోకి ఎలా మారింది? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అయిన వీడియో ప్రకారం, చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్జౌ‌లో ఒక వ్యక్తి రెండు బాతు గుడ్లను పగలగొట్టాడు.

వాటిని ఒక గ్లాస్ బౌల్(bowl)లోకి డ్రాప్ చేశాడు.అయితే అవి సాధారణ బాతు గుడ్లలా కాకుండా నలుపురంగులో కనిపించి షాక్ ఇచ్చాయి.దానిని చూసిన ఆ వ్యక్తి “ఏంటిది ఇలా ఉన్నాయి.ఈ గుడ్లు మంచివే కానీ ఆ బాతు మల్బెర్రీ (mulberry)ని తిని ఉంటుంది.

అందుకే ఇలా నలుపురంగులో ఉన్నాయి” అని వీడియో డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నాడు. మల్బెర్రీ పండ్లు ద్రాక్ష పండ్ల లాగానే నల్లగా ఉంటాయి.

వీటిని బాతులు బాగా తినేస్తుంటాయి  .అయితే వీటిని తిన్నంత మాత్రాన గుడ్డులో పచ్చసొన నల్లగా మారుతుంది అని చెప్పడానికి ఇప్పటివరకైతే ఎలాంటి ఆధారాలు లేవు.మరి ఈ బాతు గుడ్డు నల్లగా అవ్వడానికి అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది.

అయితే ఈ విచిత్రమైన వీడియో వైరల్ గా మారింది.ఇప్పటికే దీనిని 20 వేల మందికి పైగా వీక్షించారు.ఇలా జరగడం అసాధ్యం అని.ఇది గ్రాఫిక్స్ అయి ఉండవచ్చని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు మాత్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో గుడ్డు రంగును నలుపుగా మార్చి ఉంటారని చెబుతున్నారు.

మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube