సీనియర్ యాక్టర్స్ అంటే సహజంగానే అందరికి భయం ఉంటుంది.ఇక హీరోయిన్లకైతే ఇది మరీ ఎక్కువ.
హాట్ భామ శ్రద్ధ దాస్ కి బాలకృష్ణ అంటే భయం వేసిందట.ఈ బెంగాలి భామ డిక్టేటర్ లోని ఐటెం సాంగ్ లో బాలయ్య బాబుతో చిందులేసిన సంగతి తెలిసిందే.ఇంతకీ ఎందుకు భయం వేసిందో శ్రద్ధ మాటల్లోనే.
” బాలకృష్ణ గారితో ఐటెం సాంగ్ అనగానే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నా.కాని హైదరాబాద్ చేరుకున్న దగ్గరి నుంచి ఒకటే భయం.దర్శకుడు శ్రీవాస్ కి ఫోన్ చేసి టింగో టింగో పాటలోని లిరిక్స్ కి అర్థం తెలుసుకున్నా.ఆ తరువాత దాదాపు 400 సార్లు ఆ పాట విని ఉంటా.మళ్ళి సెట్ లోకి వెళ్ళాకా బాలకృష్ణ గారిని విసిగించకూడదు కదా.అందుకే నా వంతు ప్రిపెరేషన్ ముందే చేసుకున్నా.మళ్ళి డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారిని కలిసి నా స్టెప్స్ ముందే నేర్చేసుకున్నా.
బాలకృష్ణ గారి ముందు తడబడితే బాగుండదు కదా.ఇంత చేసిన నా భయం పోలేదు.ఎందుకంటే ఒక స్టెప్ లో నేను బాలకృష్ణ గారి చెంపల్ని గట్టిగా పట్టుకోవాలి.వామ్మో ఎలా చేస్తాను అని అనుకున్నా.నా భయాన్ని గమనించి బాలకృష్ణ గారు ఏం భయపడవద్దు.చెంపల్ని గట్టిగా పట్టుకో, నేనేమి అనుకోను అని ధైర్యానిచ్చారు” అంటూ చెప్పుకొచ్చింది శ్రద్ధ.